ఈసారి 8వ సీజన్లో అన్ని అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని.. ట్విస్టులు కూడా ఇలాగే అన్లిమిటెడ్ గా ఉంటాయని.. మొదట షోపై అంచనాలు పెంచేసినప్పటికీ చివరికి అన్ని పాత చింతకాయ పచ్చడిలా ఉండడంతో. ఇక షో రేటింగ్ అంతకంతకు పడిపోతుంది. దీంతో వైల్డ్ కార్డు ద్వారా కొంతమంది మాజీ కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపించి ఇక తమ రేటింగ్ పెంచుకోవాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హిస్టరీలో ఎప్పుడు లేని విధంగా ఈ ఆదివారం ఏకంగా 8 మంది మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నారు అన్నది తెలుస్తుంది.
అంతేకాకుండా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని ఒక టాక్ ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. గురువారం ఒకరు ఆదివారం మరొకరు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు రాబోతున్నారట. అయితే ఆదివారం రోజు మాత్రమే వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయట. ఇలా హౌస్ లోకి పంపించాలనుకునే 8 మంది మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ల లిస్ట్ కూడా సిద్ధం అయిపోయిందట. ఆ లిస్ట్ చూసుకుంటే..
ఏడవ సీజన్లో పాల్గొన్న గౌతమ్ కృష్ణ, నాలుగవ సీజన్లో ఎంటర్టైనర్ ఆఫ్ ది సీజన్ గా నిలిచిన ముక్కు అవినాష్, నాలుగవ సీజన్లో హౌస్ లోకి వెళ్లి మధ్యలోనే బయటికి వచ్చిన గంగవ్వ, గత సీజన్లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన నయని పావని.. గత సీజన్లో తన ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న టేస్టీ తేజ, మూడవ సీజన్లో కంటెస్టెంట్ గా అలరించిన రోహిణి, మొదటి సీజన్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలిచిన హరితేజ, నాలుగవ సీజన్లో తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న మెహబూబ్ వైల్డ్ కార్డు ఎంట్రీ వర హౌస్ లోకి వెళ్లబోతున్నారట.