ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు స్పందించిన హీరోయిన్స్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. కానీ హీరోయిన్ సంయుక్త మీనన్ మాత్రం తాజాగా సమంత మీద అన్న వ్యాఖ్యల పైన స్పందిస్తూ ఒక ట్విట్ చేసింది. ఇతరుల దృష్టి పడడం కోసమే ఇలా వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల పైన సులభంగానే ఇలాంటి ఆరోపణలు చేయగలుగుతున్నారా అంటూ ఆమె ప్రశ్నించింది.. అలాగే ఇది అమోధ్యయోగం కాదు .. చాలా ఇబ్బందికరంగా అనిపించే వ్యాఖ్యలు గతంలో ఇలాంటివి ఎప్పుడూ కూడా జరగలేదు..ఎవరైనా సరే ఇతరుల మీద దృష్టి పడడం కోసమే ఇలా ఇతరుల వ్యక్తిగత జీవితాల పైన పలు రకాల ఆరోపణలు చేయగలుగుతున్నారంటూ ఆమె ప్రశ్నించింది.
సినిమా వాళ్ళ పేర్లను ఉపయోగించి వారి యొక్క జీవితాల పైన ఆరోపణలు చేయడం ఎంతవరకు మర్యాదా ..హద్దులు దాటి ఒక వ్యక్తి ఇమేజ్ని సైతం ఇలా దెబ్బతీయడం మంచిది కాదు ప్రతి ఒక్కరి జీవితాలను గౌరవిద్దాం ,సమాజ అభివృద్ధికి పాటుపడుదాం అంటూ తెలియజేసింది సంయుక్త మీనన్ .అలాగే ఒక మహిళా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఇబ్బంది కరంగా ఉంది అంటూ ఒక ట్విట్ నీ షేర్ చేసింది సంయుక్త. అయితే సమంతకి అండగా మొట్టమొదటిసారిగా ఒక మహిళ హీరోయిన్ సపోర్టుగా నిలుస్తూ ఉన్నది. మరి ఇప్పటికైనా ఇతర హీరోయిన్లు కూడా స్పందిస్తారమో చూడాలి. అయితే చాలామంది సీనియర్ హీరోయిన్స్ కూడా ఈ విషయం పైన ఇంకా స్పందించలేదు.