అయితే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. పవన్ కళ్యాణ్ చిన్నతనం గురించి కూడా ఆమె అక్కడ మాట్లాడింది. పవన్ కళ్యాణ్ అన్నప్రాశన గురించి మాట్లాడుతూ.. కుటుంబం అంతా ఓ సారి తిరుపతి దర్శనానికి వెళ్ళాము. అప్పటికి కళ్యాణ్ కి ఆరు నెలలు. అక్కడే తిరుపతిలో యోగ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం ఉంటే కళ్యాణ్ అన్నప్రాశన అక్కడే చేద్దాము అన్నాను, దానికి మా వారు సరే అన్నారు. అప్పుడు మా దగ్గర ఉన్న వస్తువులు తిరుమల లడ్డు, కత్తి, పెన్ను, పుస్తకాలు, ఇంకొన్ని వాడి ముందు పెట్టాము.
అందులో వాడు ముందు కత్తి పట్టుకున్నాడు, ఆ తర్వాత పెన్ను పట్టుకున్నాడు. మొదట కత్తి పట్టుకోవడంతో కోపంగా ఉంటాడు, ప్రజల కోసం ఏదో ఒకటి చేస్తాడేమో అనుకున్నాను. రెండో సారి పెన్ను పట్టుకోవడంతో చదువు తక్కువ ఉంటుంది అని అనుకున్నాను అని తెలిపారు. అలాగే పవన్ ఎన్నికల ముందు ఒక ఆందోళనలో పాల్గొని రోడ్డుమీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందని అంజనా దేవి అన్నారు. త్వరలోనే ఈ పూర్తి ఇంటర్వ్యూ రానుంది. అమ్మ మనసు అనే ఈ ఇంటర్వ్యూ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.