ఆచార్య లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తో మూవీ  తారక్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ప్లాఫ్ డైరెక్టర్ తో సినిమా ఎందుకని ప్రశ్నలు కూడా వచ్చాయి .. కానీ కొరటాలను నమ్మి మరో అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్ .. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా షూటింగ్ చేసుకుని సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది దేవర. ఇక కట్ చేస్తే బెనిఫిట్ షోస్ నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న తర్వాత నుంచి హిట్‌ టాక్ తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.


ఇక ఎన్టీఆర్ నటనకు అనిరుధ్‌ అదిరిపోయే మ్యూజిక్ తోడవడంతో దేవర నెగటివ్ కామెంట్స్ ను సైతం పక్కకు నెట్టి కలెక్షల సునామీ సృష్టిస్తుంది.  ఇక మన తెలుగు రాష్ట్రాల తో పాటు  ఓవర్సీస్ లోనూ దేవర దండయాత్ర మామూలుగా లేదు. ‘దేవర: పార్ట్ 1’ హిందీలో మంచి వసూళ్లు సాధిస్తుంది. మొదటి ఆరు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా గ్రాస్, రూ.45 కోట్లకు పైగా నెట్‌ను దేవర వసూలు చేసింది.  ఇక దేవ‌ర‌ భారీ కలెక్షన్లు సాధిస్తూ బ్రేక్ ఈవెన్ దశ‌కు చేరుకుంది.  ఇక తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ . 172 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఆరు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా రూ. 396 కోట్లు రాబట్టింది .

అటు తెలుగు రాష్ట్రాల్లోనూ దేవర అదరగొడుతుంది . ముఖ్యంగా సీడెడ్ వంటి ఏరియాల లో టాక్ తో సంబంధం లేకుండా  రూ. 20 కోట్లకు పైగా షేర్ రాబట్టాడు దేవర. మొత్తంగా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వాసులు చేసింది దేవర . ఇటు ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో 5.4 మిలియన్ రాబట్టింది దేవర. ఈ కలెక్షన్స్ అన్ని కేవలం ఎన్టీఆర్‌ అనే టైటిల్ తో మాత్రమే వచ్చాయని ట్రేడ్ వ‌ర్గ‌లు విశ్లేషిస్తున్నారు. ఇక మరి ఎన్టీఆర్ దేవర‌తో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: