టాలీవుడ్ టాప్ హీారోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. టాలీవుడ్ లో ఆయనకున్న పాపులారిటీ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. దేవర సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ పై అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేస్తూ దుస్తుకు పోతున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే 400 కోట్లకు పైగా భారీ కలెక్షన్లు అందుకుని బ్రేక్ ఈవెంట్ కు దగ్గరగా ఉంది. ఇలా ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న యంగ్ టైగర్ తన తర్వాత సినిమాలతో కూడా అభిమానులకు ఫుల్ కిక్కు ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే వారు 2 షూటింగ్లో పాల్గొన్న ఎన్టీఆర్.. డిసెంబర్ నుంచి ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ను కూడా ప్రారంభించనున్నాడు.
ఇలా తన తర్వాత సినిమాలతో కూడా ఎన్టీఆర్ రాత్రి పోయి రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు.

అయితే ఎన్టీఆర్ గతంలో చాలా కమర్షియల్ యాడ్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కమర్షియల్ యాడ్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్ బాంబినో సేమ్యా యాడ్ లో నటించారు. తాజాగా ఆ యాడ్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఎన్టీఆర్.  మీరు కూడా ఆ కొత్త యాడ్ చూసేయండి.. అయితే ఈ యాడ్ తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా ఎన్టీఆర్ నటించారు. కాని కన్నడలో మాత్రం ఎన్టీఆర్ కు వేరేవాళ్లు డబ్బింగ్ చెప్పారు. ఇక ఈ యాడ్ కోసం ఎన్టీఆర్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

ఇక ఇప్పటికే ఎన్టీఆర్ యాపి ఫిజ్, లీసియస్ మరియు KFC.లాంటి పలు భారీ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.ఇలా ఎన్టీఆర్ పలు యాడ్ లలో నటిస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో నే వుంటున్నారు. ఎన్టీఆర్ యాడ్స్  రెమ్యూనరేషన్ విషయంలో కూడా టాప్ ప్లేస్ లోనే ఉన్నాడు.. ఇప్పటివరకు ఆయన ఎన్నో యాడ్స్ లో నటించారు . ఇప్పుడు తాజాగా వచ్చిన కొత్త అడ్వర్టైజ్మెంట్ కూడా ఎన్టీఆర్ భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ పుచ్చుకున్నాడని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: