ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో శంకర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలా మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఆఖరుగా శంకర్ , సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా ఐశ్వర్య రాయ్ హీరోయిన్గా రూపొందిన రోబో సినిమాతో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాలను అందుకోలేదు.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం అమీర్ ఖాన్ హీరోగా హిందీ లో 3 ఇడియట్స్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను శంకర్ తెలుగు , తమిళ భాషల్లో స్నేహితుడు అనే టైటిల్ తో రీమిక్ చేశాడు. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో ఎస్ జె సూర్య నటించాడు. ఈ మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే శంకర్ కొంత కాలం క్రితం ఇండియన్ 2 అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యి భారీ అపజయాన్ని ఎదుర్కొంది.

తాజాగా శంకర్ గేమ్ చేంజర్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ లో రామ్ చరణ్ హీరోగా నటించాడు. ఇకపోతే ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించాడు. ఇప్పటివరకు శంకర్ దర్శకత్వంలో రూపొందిన స్నేహితుడు , ఇండియన్ 2 మూవీలలో ఎస్ జె సూర్య నటించాడు  ఈ రెండు మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మరి గేమ్ చెంజర్ సినిమాలో కూడా ఈయన నటించాడు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: