2012లో కోలీవుడ్ లో జీవ హీరోగా నటించిన "మూగామూడి'' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ పూజ హెగ్డేకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చారు. 2014లో నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం, వరుణ్ తేజ్ సినిమా ముకుందాలో నటించింది. ఈ సినిమాలు మంచి హిట్ అవడంతో అనంతరం 2015లో అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలో నటించింది. ఈ సినిమాతో కంబ్యాక్ అందుకుంది. రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి వంటి స్పెషల్ సాంగ్ లో కనిపించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అరవింద సమేత, వీర రాఘవ, గద్దల కొండ గణేష్, మహర్షి వంటి సినిమాలలో నటించింది.
ఈ సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి 2020లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన అల వైకుంఠపురం సినిమా పూజ హెగ్డే కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో పూజా హెగ్డే ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా నిలిచింది. అయితే ఆ సినిమా అనంతరం మళ్లీ పూజను వరస ఫ్లాప్లు ఇబ్బంది పెట్టాయి. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం పూజ హెగ్డే కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళ్ హీరో విజయ్ తో పూజాకు ఏఫైర్ ఉందని ఉమైర్ సంధు సంచలన పోస్ట్ చేశాడు. 'బీస్ట్' సినిమాలో విజయ్, పూజ హెగ్డే కలిసి నటించారు. అయితే ఆ సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని ఆరోపణలు చేశాడు. ఈ వార్తలపై ఎవరో ఒకరు స్పందిస్తే కానీ అసలు విషయం తెలియదు