రాశిఖన్నా ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది ఆ సినిమా అనంతరం కొన్ని సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకుంది. మంచి కథ ఉన్న సినిమాలు సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది బ్యూటీ రాశి కన్నా. హీరోల లక్కీ హీరోయిన్ గా మారుతోంది. ఈ బ్యూటీ చిన్న హీరోల నుంచి పెద్ద హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.


రాశి కన్నా ఒకప్పుడు బొద్దుగా, అందంగా ఉండేది. ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. జీరో సైజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా గ్లామర్ డోస్ పెంచుతూ ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశి కన్నా రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలతో అభిమానులకు కనువిందు చేస్తోంది. తాజాగా మరోసారి తన స్టన్నింగ్ ఫోటోలతో అభిమానులను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం.


ఈ ఫోటోలో రాశి కన్నా స్టైలిష్ డ్రెస్ లో తన అందాలను ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం రాశి కన్నాకు చెందిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ గా అవుతోంది. ఈ బ్యూటీ ఓ సందర్భంలో ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, అతనితో ఉన్న రిలేషన్ కారణంగానే ఇలా సన్నగా తయారయ్యానంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.


కానీ ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలు మాత్రమే ఇప్పటివరకు వెల్లడించలేదు. కాగా, రాశి కన్నా దుబాయ్ కి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ఎఫైర్ కొనసాగిస్తుందని సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు జోరందుకుంటున్నాయి. అతనితో దుబాయిలో కొన్ని వ్యాపారాలు కూడా చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: