మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో రెండవ సినిమాగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... ఈ మూవీ కి విజయేంద్రప్రసాద్ కథను అందించాడు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ సినిమా అప్పటి వరకు ఏ టాలీవుడ్ మూవీ వసూలు చేయని కలెక్షన్లను రాబట్టి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను నిలిచింది.

ఇకపోతే మగధీర సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో దాదాపు ఇదే జోనర్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ శక్తి మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా ... ఇలియానామూవీ లో హీరోయిన్గా నటించింది. అశ్వినీ దత్మూవీ ని నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే మగధీర మూవీ జోనర్ లోనే అల్లు అర్జున్ కూడా ఓ మూవీ లో నటించాడు.

ఈయన బద్రీనాథ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించగా ... వి వి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్మూవీ ని నిర్మించాడు. మగధీర ఫార్ములా ను కాపీ చేసి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందాం అనుకున్నా ఈ ఇద్దరు హీరోలకు కూడా శక్తి , బద్రీనాథ్ సినిమాలతో చేదు అనుభవాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: