ఇవి సహజంగానే జుగుస్సాకరంగా ఉన్నాయి. దీంతో ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా స్పందించింది. కొండా సురేఖ ను తప్పు పట్టింది. అయితే ముందుగా సోషల్ మీడియాలో కొండా సురేఖ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వచ్చిన కామెంట్లతో రాత్రికి మన టాలీవుడ్ స్టార్లు ధైర్యం తెచ్చుకున్నట్టు ఉన్నారు. సమంతకు ఆత్మీయులుగా పేరు ఉన్న ఎన్టీఆర్, నాని సహా అందరూ స్పందించారు. ఇక మహేష్ - రవితేజ ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ దీనిని వ్యతిరేకించారు.
అక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడే టాలీవుడ్ ద్వంద ప్రమాణాలు బయట పడుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ పై శ్రీ రెడ్డి చేసిన కామెంట్ల కు ఎవ్వరూ స్పందించ లేదు. ఆ తర్వాత అదే వపన్ తల్లి అంజనా దేవిని శ్రీ రెడ్డి విమర్శించి నప్పుడు ఇదే ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ స్పందించ లేదు. మరి మెగా ఫ్యామిలీ విషయం లో ఒకలా స్పందించిన టాలీవుడ్ .. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ విషయం లో మరోలా ఏకతాటి మీదకు వచ్చి ఇలా కట్ట కట్టుకుని కామెంట్ చేయడం ఏంటి ? ఈ దారుణ ఏంటి.. ఇది టాలీవుడ్ కు సిగ్గు అనిపించడం లేదా ? అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.