గ్రేట్ డైరెక్టర్ శంకర్ కొంత కాలం క్రితం ఇండియన్ 2 అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించగా ... సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా మొదలు అయిన తర్వాత ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. కానీ చివరగా ఈ సినిమాను తమిళ్ తో పాటు కేవలం తెలుగు , హిందీ భాషలలో మాత్రమే విడుదల చేశారు. తాజాగా శంకర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే మూవీ ని రూపొందించాడు.

ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్గా నటించగా , ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు  ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన సాంగ్స్ ను మాత్రం కేవలం తెలుగు , తమిళ్ , హిందీ భాషలలోనే మాత్రమే విడుదల చేశారు.

దానితో ఈ సినిమాను ఇండియా వ్యాప్తంగా ఐదు భాషలలో విడుదల చేస్తారా ..? లేక కేవలం మూడు భాషల్లోనే విడుదల చేస్తారా అని చరణ్ ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి ప్రస్తుతం చరణ్ కు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉంది.  ఆ క్రేజ్ ను యూస్ చేసుకొని ఐదు భాషలలో గేమ్ చేంజర్ మూవీ ని విడుదల చేస్తే భారీ మొత్తంలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని చరణ్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: