సాధారణంగా ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడటానికి వస్తే ఇంట్లో మగవాళ్ళు ఉన్నా కూడా తెగ టెన్షన్ పడిపోవడం చేస్తూ ఉంటారు. అలాంటిది కేవలం ఒక మహిళ మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఇంకెంత టెన్షన్ పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం ముగ్గురు దొంగలు ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న వారితో వీరోచిత పోరాటం చేసింది. మహిళా డోర్ లోపల వైపు నుంచి తన పూర్తి శక్తిని ఉపయోగించి దొంగలను తలుపు తెరవనీయకుండా చేసింది. ఒంటరిగా పోరాటం చేసి తలుపుకు గడియ పెట్టింది. ఒక చేత్తో తలుపును పట్టుకుని మరో చేత్తో సోఫా అని లాగి తలుపుకు అడ్డంగా వేసింది. ఇంట్లో పిల్లలు ఉన్నారు వారికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని భావించి అపరకాళీలా దొంగలపై ఒంటరి పోరాటం చేసింది. ఇక ఆ తర్వాత లోపలికి వెళ్లలేము అని గ్రహించిన దొంగలు ఇక అక్కడి నుంచి పరారయ్యారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సదరు మహిళ ధైర్య సాహసాలకు సోషల్ మీడియా జనాలు ఫిదా అవుతున్నారు.