ఈ షో ద్వారా బాలయ్య వ్యక్తిత్వం ఎంత మంచిది అన్న విషయం అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా అర్థం అయిపోయింది. ఇక ఆయన షో పోస్ట్ చేస్తున్న తీరుకు అందరూ ఫిదా అయిపోయారు.. అయితే ఎప్పుడూ సరదాగా కూల్ గా కనిపించే బాలకృష్ణ కోపం వస్తే మాత్రం అస్సలు ఆగరు. ముందు ఉన్నది ఎవరు అని పట్టించుకోకుండా చెంపపై ఒకటి పీకుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అభిమానులను ఎన్నోసార్లు కొట్టిన వీడియోలు కూడా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయాయి. అయితే బాలకృష్ణ లాంటి పెద్ద హీరోకి ఇలా ఫ్యాన్స్ ని కొట్టడం విషయంలో ప్రశ్న అడిగితే ఇక ఇంటర్వ్యూలో ఎంత కోపం వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కానీ ఇటీవల ఒక మహా అవార్డు వేడుకలో ఇలాంటి ప్రశ్న బాలయ్యకు ఎదురయింది. బాలయ్యను అందరి ముందు ఇలాంటి ప్రశ్న అడగడానికి అంత ధైర్యం చేస్తారా అని అనిపించవచ్చు. కానీ ఫిలింఫేర్ అవార్డుల ఈవెంట్లో ఇదే జరిగింది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బాలకృష్ణ మీరు ఫ్యాన్స్ ని కొడతారట ఎందుకు అంటూ ప్రశ్నించాడు. ఇప్పుడు నేను కూడా భయపడుతున్న అంటూ జోక్ వేశారు. అయితే బాలయ్య దీనికి సీరియస్ అవ్వకుండా ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. తనను ఇమిటేట్ చేస్తుంటారు. అందుకే అలా కొడుతుంటాను. అది తనకు వారి మీద ఉన్న ప్రేమ అంటూ చెప్పుకొచ్చాడు బాలకృష్ణ.