మనదేశంలో జ్యోతిష్యాన్ని నమ్మేవారు కోట్లలోనే ఉంటారు. కేవలం సామాన్యులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా జ్యోతిష్యాన్ని ఎంతో గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది స్వామీజీలు చెప్పిన విషయాన్ని పాలో అవడం ఇప్పటివరకు ఎన్నో సార్లు చూసాము. అయితే ఇలా జ్యోతిష్యులు చెప్పిన మాటలు విని కెరియర్లో నిలదొక్కుని తమకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు.


 ఇక సినిమా ముహూర్తం దగ్గర నుంచి సినిమా విడుదల వరకు కూడా ఇలా జ్యోతిష్యులు చెప్పిన సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు ఎంతోమంది స్టార్లు. అయితే ఇక్కడ ఒక స్టార్ హీరో మాత్రం జ్యోతిష్యం గుడ్డిగా నమ్మి చివరికి కెరియర్ నే నాశనం చేసుకున్నాడు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ నటుడు గోవిందా. ఈ విషయాన్ని కోమల్ నహ్తా అనే సినీ విశ్లేషకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గోవిందా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు షారుక్, సల్మాన్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎంత రెమ్యూనరేషన్  అడిగిన నిర్మాతలు ఇచ్చేవారు. అంతేకాదు ఏడాదిలో పది సినిమాలు చేస్తూ ఉండేవాడు.


 ఇలాంటి సమయంలో ఒక జ్యోతిష్యుడుని కలవడం గోవింద కెరియర్ను నాశనం చేసింది. ఓసారి గోవింద జ్యోతిష్యుని కలిసినప్పుడు పెన్నుల వల్ల నీ జీవితం నాశనం అవుతుంది అని చెప్పాడట. దీని అర్థం జర్నలిస్టులు తప్పుడు రాతలు రాయడం వల్ల ఇక కెరియర్ గ్రాఫ్ పడిపోతుందని మళ్లీ మొదటికి వస్వు అంటూ జ్యోతిష్యుడు చెప్పాడట. ఇక దీనిని గోవిందా గుడ్డిగా నమ్మాడు. అప్పటి నుంచి ఏకంగా పెన్నులనే దూరంగా పెట్టడం మొదలుపెట్టాడు. జీతో చప్పట్ పాడు కె అనే షోలో కూడా ప్రేక్షకులు ఎవరు పెన్నులు తీసుకురావద్దు అంటూ నియమం పెట్టాడు. షూటింగ్ సెట్లోకి కూడా ఈ నటీనటులు ఎవరు పలానా దుస్తులు మాత్రమే కాదు పెన్నులు కూడా తీసుకురావద్దు అంటూ టార్చర్ పెట్టేవాడట రాను రాను అతని పిచ్చి మరింత ముదలడంతో ఇక అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన గోవిందా శివసేన పార్టీలో చేరి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: