ఊహించని ట్విస్ట్ లతో అదిరిపోయే టాస్కులతో.. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైంది అంటే చాలు వైల్డ్ కార్డు ఎంట్రీ విషయంలో ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఇప్పటికే 12 మంది హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ అటు బిగ్ బాస్ చెప్పేసాడు. ఇక వాళ్లు రాకుండా ఆపై ఛాన్స్ కంటెస్టెంట్స్ కే ఇచ్చేశాడు.


 అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఎక్కువ అవకాశాలు ఇవ్వకుండా ఈ ఆదివారమే అటు ఎంతో మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ ని హౌస్ లోకి పంపించబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఇక ఈ వారం రెండు ఎలిమినేషన్స్ చేయడానికి సిద్ధమైన బిగ్బాస్.. 8 మందిని వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి పంపించబోతున్నాడట. అయితే ఇలా హౌస్ లోకి రాబోయే వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ విషయంలో కన్ఫ్యూషన్ లో పెట్టేస్తున్నాడు బిగ్ బాస్. ఆయా కంటెస్టెంట్లకు సంబంధించి షాడో ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. మొదటి వైల్డ్ కార్డు ఎవరో కనిపెట్టండి అంటూ టేస్టీ తేజ షాడోని చూపించిన బిగ్బాస్ ఇక ఇప్పుడు సెకండ్ వైల్డ్ కార్డు ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.



 ఆ షాడో లో లేడీ కంటెంట్ ఉంది అన్నది అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఇలా టేస్టీ తేజ తర్వాత లేడీ కంటస్టెంట్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంటర్ ఇవ్వబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే ఈ షాడో లో ఉన్న లేడీ కంటెస్టెంట్ ఎవరబ్బా అని చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతుంది. కాగా ఈ షాడో ఫోటో ని చూసిన వారందరూ కూడా రోహిణి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతుంది అని కనిపెట్టేశారు. కాగా రోహిణి మొదట సీరియల్స్ నటించి ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయింది. జబర్దస్త్ నుంచి సేవ్ ద టైగర్ సినిమాలో నటించి గుర్తింపును సంపాదించుకుంది. ఇక గతంలో బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే రేంజ్ లో కామెడీ పంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: