అయితే ఇలా టాలీవుడ్ లో సస్పెన్స్ త్రిల్లర్ సినిమాలు ఎన్నో వచ్చాయి. కానీ హిట్ సిరీస్ మాత్రం ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ మూవీ సూపర్ హిట్ అయింది. ఇక దీనికి కొనసాగింపుగా వచ్చిన హిట్ 2 కూడా సూపర్ సక్సెస్ సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రెండు భాగాలు సక్సెస్ కావడంతో హిట్ సిరీస్ లో మూడో భాగం కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో ప్రొడ్యూసర్ నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే రిలీజ్ అయిన రెండు భాగాలు భారీ విజయం సాధించడంతో.. ఇక ఇప్పుడు మూడో భాగంపై భారీగానే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్లాన్ చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. స్టోరీ డిమాండ్ మేరకు ఇలా షూటింగ్ లొకేషన్స్ మారుస్తూ వస్తున్నారట డైరెక్టర్ శైలేష్ కొలను. ఇందులో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. అయితే ఈ మూవీలో అటు విలన్ పాత్రలో నటించబోయేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్ నీ ఇక ఈ సినిమాలో విలన్ గా తీసుకున్నరట. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరి అతన్ని ఈ సినిమా చేయడానికి ఒప్పించారట.