రకుల్ ప్రీతిసింగ్ ఇలా స్పందిస్తూ తమ రాజకీయాల కోసం పేరును వాడుకోవడం ఆపివేయాలని ఎవరైనా సరే గౌరవం కోసం మాట్లాడకుండా ఉంటే వాటిని బలహీనతగా చూస్తున్నారంటూ వెల్లడించింది. తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.. ఇందులో తాను చాలా గొప్పగా ప్రయాణం చేశాను ఇండస్ట్రీకి చాలా కనెక్ట్ అయ్యాను ఇలాంటి పరిశ్రమలో మహిళల గురించి ఇలాంటి దుర్మార్గపు పుకార్లను సైతం వ్యాప్తి చెందడం చాలా బాధాకరంగా అనిపించింది.. ఇందులో మరొక నిరుత్సాహం ఏమిటంటే బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనకు చాలా బాధ కలిగించింది అంటూ రకుల్ తెలియజేసింది.
అయితే తమ మీద వస్తున్న పుకార్లకు సైలెంట్ గా ఉండడం అది బలహీనతగా భావిస్తున్నారనీ తాను పూర్తిగా రాజకీయ వ్యతిరేకినని తనకు ఏ వ్యక్తి కూడా రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. తన పేరును కూడా కేవలం హానికరమైన రీతిలోనే ఉపయోగించడం మానివేయాలని తాను కోరుకుంటున్నట్లుగా తెలియజేసింది. కేవలం రాజకీయంగా ఎదగడం కోసమే ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదని ఆర్టిస్టులను ఈ రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలని కోరుకుంటున్నానని తెలిపింది రకుల్ ప్రీతిసింగ్.సినీ ఇండస్ట్రీలోని నటి నటులు అంటే కేవలం హెడ్లైన్స్ అర్థంలేని కథలలోని పేర్లను వాడడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అంటూ తెలిపింది.