తెలుగు సినీ పరిశ్రమకు ఇతర భాషలలో నుంచి నటులుగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో నటుడు మోహన్ రాజ్ కూడా ఒకరు. ఒకప్పుడు తెలుగు సినిమాలలో విలన్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషలలో కూడా స్టార్ హీరోలందరితో కూడా నటించిన మోహన్ రాజ్.. లారీ డ్రైవర్, శివమణి ,అసెంబ్లీ రౌడీ, సమరసింహారెడ్డి, రౌడీ ఇన్స్పెక్టర్ తదితర చిత్రాలలో కూడా నటించి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు.


అయితే తాజాగా నటుడు మోహన్ రాజ్ కన్నుమూసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజున మూడు గంటల సమయంలో తన ఇంట్లో తుది  శ్వాస విడిచినట్లుగా సమాచారం. ఇప్పటి వరకు ఈయన అన్ని భాషలలో కలుపుకొని సుమారుగా 300కు పైగా చిత్రాలలో నటించారట. ఈయన ఎక్కువగా విలన్ పాత్రలోని నటించేవారు..అయితే గత కొంతకాలంగా ఈ నటుడు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఈరోజు మధ్యాహ్నం కన్ను మూసినట్టుగా తెలుస్తోంది.. మొదటిసారిగా 1988లో మూడో ముర అనే చిత్రం ద్వారా ఇండస్ట్రియల్ కి ఎంట్రీ ఇచ్చారు. ఈయనకు ఉష అనే అమ్మాయితో వివాహం కాదు వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


నటుడు మోహన్ రాజ్.. సినిమాలలోనే కాకుండా మలయాళ సీరియల్స్ లో కూడా నటించే వారట.ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన అనారోగ్య సమస్యల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారట. గతంలో కూడా ఈయన ప్రభుత్వ ఉద్యోగం చేసే వారిని సమాచారం. తెలుగులో చివరిగా బాలయ్యతో కలిసి నరసింహనాయుడు అనే చిత్రంలో నటించారట .తెలుగులో అయితే ఇదే ఆఖరి చిత్రం అన్నట్లుగా సమాచారం. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి సినిమాలలో నటించలేదట. కానీ ఇప్పుడు తాజాగా ఈ నటుడు మరణించినట్లుగా వార్తలు రావడంతో పలువురు సినీ సెలబ్రిటీలు అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: