కొన్ని సంవత్సరా ల క్రితం మన తెలుగు సినిమాలు దాదాపుగా కేవలం తెలుగు భాషలో మాత్రమే విడుదల అవుతూ ఉండేవి . ఏమో కొన్ని సినిమాలు మాత్రమే ఇతర భాష లో డబ్ అయ్యి విడుదల అవుతూ ఉండేవి . కానీ ఎప్పుడూ అయితే బాహుబలి సినిమా విడుదల అయ్యిం దో అప్పటి నుండి తెలుగు సినిమా క్రేజ్ ఇండియా వ్యాప్తంగా పెరిగి పోయింది . ఇక బాహుబలి సినిమా ఐదు భాషల్లో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించి భారీ కలెక్షన్లను వసూలు చేయడం తో అప్పటి నుండి తెలుగు సినిమా హీరో లు , దర్శకులు , నిర్మాత లు ఎక్కువ శాతం పాన్ ఇండియా సినిమా ల వైపు దృష్టి సారిస్తున్నారు .

ఇకపోతే బాహుబలి సినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదల కావడం మాత్రమే కాకుండా రెండు భాగాలుగా విడుదల అయ్యి సూపర్ సక్సెస్ కూడా అయింది. ఇక దాదాపుగా పాన్ ఇండియా సినిమాలు అంటే రెండు భాగాలుగా విడుదలవుతున్నాయి. దానితో చిన్న కథలను కూడా రెండు భాగాలుగా తీయాలి అని కొంత మంది మేకర్స్ అనుకోవడంతో పాన్ ఇండియా సినిమాలలో ఫస్ట్ పార్ట్ లో కథ , కథనాలు తేలిపోతున్నాయి అని జనాలు అభిప్రాయపడుతున్నారు.

దానితో చాలా మంది అనవసరంగా రెండు భాగాలు ప్లాన్ చేస్తున్నారు. ఒక భాగంలోనే సినిమా కథ మొత్తం చెప్పి ఉంటే స్టోరీ చాలా గ్రిపింగ్ గా ఉండేది అనే కామెంట్స్ వచ్చిన సినిమాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపై హీరోలు , దర్శకులు , నిర్మాతలు కూడా పాన్ ఇండియా సినిమాలు తీసినా కూడా కథలో బలం లేనట్లు అయితే రెండు భాగాలుగా దానిని తీయడం అనవసరం అనే అభిప్రాయాలను జనాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: