సినిమా ఇండస్ట్రీలో ఒకరితో అనుకున్న సినిమాను మరొకరితో రూపొందించడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఒక వేళ ఒక నటితో అనుకున్న సినిమా మరొక నటితో తీసినప్పుడు ఆ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే ఆ మూవీ ని మొదటి రిజెక్ట్ చేసిన ముద్దుగుమ్మ బాధపడే అవకాశాలు ఉంటాయి. అదే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడితే ఆ సినిమాను రిజెక్ట్ చేసినందుకు బ్యూటీ చాలా ఆనందపడే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న రష్మిక మందన ఓ రెండు సినిమాలను రిజెక్ట్ చేయగా , అందులో టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి పూజా హెగ్డే నటించిందట.

రష్మిక రిజక్ట్ చేసిన ఆ రెండు మూవీలు ఫ్లాప్ అయ్యాయి. దానితో పూజా హెగ్డే కు ఆ రెండు మూవీల ద్వారా ఫ్లాప్ లు వచ్చాయి. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం. కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే , రామ్ చరణ్ కి జోడిగా నటించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా మొదట రష్మిక ను తీసుకోవాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఆ ముద్దుగుమ్మను సంప్రదించిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయలేను అని రష్మిక చెప్పిందట.

దానితో ఈ మూవీలో రష్మికను కాకుండా పూజ హెగ్డే ను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కొంత కాలం తమిళ నటుడు విజయ్ "బీస్ట్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో కూడా హీరోయిన్ అవకాశం కూడా మొదటగా రష్మిక కే వచ్చిందట. కానీ ఈమె మాత్రం ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఇక ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఇలా రష్మిక రిజెక్ట్ చేసిన రెండు మూవీలలో పూజా హెగ్డే నటించి రెండు ఫ్లాప్ లను అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: