వేట్టయాన్ చిత్రంలో రజనీకాంత్ డైలాగులు యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్లో చూపించడంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు భావించారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మధురై హైకోర్టులో ఫీల్ దాక్కలైనట్లుగా తెలుస్తోంది. టీజర్ లో సంభాషణలు చాలా చట్ట విరుద్ధంగా ఉన్నాయని ఎన్కౌంటర్లను ప్రోత్సహించే విధంగా ఉంటున్నాయంటూ ఒక వ్యక్తి కోర్టును సైతం ఆశ్రయించారట. సినిమా విడుదల కాకుండా మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేయాలని కోర్టును సైతం కోరారట. వేట్టయాన్ టీజర్లో చూపించిన అత్యంత భయంకరమైన క్రిమినల్స్ ను ఏ మాత్రం భయపడకుండా ఎన్కౌంటర్ చేయడం వల్ల వీళ్లు హీరోలు అయ్యారు అంటూ మరికొన్ని సంభాషణలు ఉండడం పైన అభ్యంతరాన్ని తెలియజేస్తున్నారు.
ఇవి చట్టబద్ధమైనటువంటి ఎన్కౌంటర్స్ కాదని చట్టానికి విరుద్ధమైనటువంటి ఎన్కౌంటర్స్ అని వీటివల్ల ప్రజల ఆలోచన కూడా మారేలా ఉంటుందంటూ వెంటనే ఆ సంభాషణలను తొలగించాలి లేకపోతే మ్యూట్ చేసేలా ఉండాలి అన్నట్టుగా కోర్టు దృష్టికి ఆ వ్యక్తి తీసుకువెళ్లారు.. దీంతో కోర్టు కూడా విచారణ జరిపిన తర్వాత లైకా ప్రొడక్షన్స్ కు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది ఈ సినిమా పైన మభ్యంతర నిషేధం విధించాలన్న విన్నపాన్ని కూడా తోసి వచ్చేశారు. అయితే లైకా ప్రొడక్షన్స్ స్పందనను బట్టి తదుపరి విచారణ ఉంటుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక విడుదలకు ముందే వేట్టయాన్ చిత్రంకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయో చూడాలి.