* మొదట కొండా సురేఖ బాధితురాలు

* కోపంతో లిమిట్స్ దాటేశారు

* సినిమా ఇండస్ట్రీకి టార్గెట్ అయ్యారు  

( ఏపీ - ఇండియా హెరాల్డ్)

తెలంగాణ మంత్రి కొండా సురేఖ కేటీఆర్, నాగార్జున, నాగచైతన్య, సమంతల గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కాంట్రవర్సీ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. నిజం చెప్పాలంటే కొండా సురేఖ ఇలా మాట్లాడడానికి ఒక కారణం ఉంది. ఆమె కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా ట్రోలింగ్‌కు ఒక విక్టమ్ అయ్యారు. రఘునందన్, కొండా సురేఖ ఇద్దరినీ కలిపి నీచంగా ట్రోల్ చేశారు బీఆర్‌ఎస్‌ సపోటార్లు. ఆమె మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం కూడా జరిగింది. ఆ సమయంలో కేటీఆర్ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు అంటూ ఆమెను విమర్శించారు. అది భరించలేక కొండా సురేఖ కేటీఆర్ మీద దారుణమైన అలిగేషన్స్ చేసింది. ఈ సమయంలో నాగార్జున, నాగచైతన్య నీచులుగా చిత్రీకరించారు.

ఆమె ఏమన్నారంటే నాగార్జున తన కోడలను అంటే నాగచైతన్య భార్యను కేటీఆర్ వద్దకు పంపించడానికి సిద్ధమయ్యారట. నాగచైతన్య కూడా కేటీఆర్ వద్దకు వెళ్ళు అని సమంతపై ఒత్తిడి చేశారట. కాదు అంటే ఆమెను వెళ్ళగొట్టారట. కొండా సురేఖ సమంతను నీచంగా చిత్రీకరించిందని చాలామంది ఫైర్ అవుతున్నారు కానీ లాజికల్ గా ఆలోచిస్తే ఆమె క్యారెక్టర్‌ను ఎక్కడా కూడా కొండా సురేఖ తక్కువ చేసి మాట్లాడలేదు. ఎన్ కన్వెన్షన్ హాల్ విషయంలో ఈ రచ్చ జరిగిందని ఆమె చెబుతున్నారు. కేటీఆర్ వద్దకు వెళ్లడానికి సమంత అంగీకరించలేదట. అంటే ఇక్కడ సమంత క్యారెక్టర్ మంచిదని కొండా సురేఖ చెప్పినట్లే కదా. అంతేకాదు తన భర్త మామ ఆదేశాలను ఒత్తిడికి ఎదురొడ్డి నిలబడి ఆమె తన క్యారెక్టర్ ని కాపాడుకున్నట్టుగా కొండా సురేఖ చెప్పినారు.  

 సమంత సురేఖ మాటలు విన్న తర్వాత చాలా హుందా గానే రియాక్ట్ అయింది. తనని పాలిటిక్స్ లోకి లాగొద్దు అని, విడాకులు తమ ఇష్ట ప్రకారమే జరిగాయని, రాజకీయ వ్యక్తుల ప్రమేయం ఏదీ లేదని స్పష్టం చేసింది. అయితే కొండా సురేఖ సినిమా ఇండస్ట్రీ వారి విషయంలో బాగా హద్దులు దాటారు లిమిట్ క్రాస్ చేసి ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేశారు. దీని కారణంగా మొత్తం ఇండస్ట్రీ ఏకమై ఆమెను ఏకిపారేస్తున్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ఈ విధంగా స్పందించలేదు ఇప్పుడే నాగార్జున ఫ్యామిలీని కాపాడడానికే ఇండస్ట్రీ ఏకతాటిపై ఏకమై కొండా సురేఖ పై విరుచుకుపడుతోంది. ఇక్కడ ఇదే ఆశ్చర్యకరమని చాలా మంది అంటున్నారు. జూ.ఎన్టీఆర్, నాని వీరందరి రెస్పాన్స్ కూడా ఆశ్చర్యకరం.

 శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ అమ్మగారిని బూతులు తిట్టినప్పుడు వీరెవరూ కూడా పెద్దగా మాట్లాడలేదు. పోసానికి కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పిల్లల గురించి ఏమి కూడా దారుణంగా మాట్లాడారు. అప్పుడూ రెస్పాన్స్ లేదు. ఇలా సినిమా వాళ్ల గురించి చీప్ గా మాట్లాడినప్పుడు ఎవరు స్పందించ పోవడం వల్ల సినిమా వాళ్ళంటే మరింత చులకన భావం ఏర్పడింది. సెలెక్టెడ్ గా రెస్పాండ్ అవ్వడం అనేది వారికే చేటు. కానీ నాగార్జున ఫ్యామిలీ విషయంలో మాత్రం వీళ్ళందరూ ఎక్కువగా స్పందిస్తున్నారు. ఇక కేటీఆర్ తన ఇమేజ్ ని ప్రజల్లో దెబ్బతీనే లాగా కొండా సురేఖ మాట్లాడారు కాబట్టి ఆమెపై కేసు వేయడానికి రెడీ అయిపోయారు. మొత్తం మీద కొండా సురేఖ పెద్ద చిక్కుల్లో పడిపోయారు..

మరింత సమాచారం తెలుసుకోండి: