- రాజకీయలకు బలవుతున్న కథానాయికలు..
- సెలబ్రిటీలపై చిన్న చూపు..
- మొన్న త్రిష ఇప్పుడు సమంత..

రాజకీయాలకు సినిమాలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది అంటారు.. ఎందుకంటే సినిమాల్లో పాపులర్ అయిన చాలామంది రాజకీయాల్లోకి వచ్చి ఆ పాపులారిటీతో ప్రజల మనసును గెలిచి రాజకీయాల్లో కూడా సక్సెస్ అయిన వారు ఉన్నారు.అలాంటి వారిలో సీనియర్ ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, జయసుధ, జయప్రద,రోజా, బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు ఉన్నారు.. అయితే ఇది మంచి విషయమే కానీ చాలామంది రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం కొంతమంది పై విషం చిమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా వారి తప్పులు కప్పి పుచ్చుకోవడానికి మరో విషయాన్ని తెర మీదికి తీసుకు వస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలైతే మరీ దారుణంగా ఉన్నాయి.ఆమె మాటలతో అక్కినేని ఫ్యామిలీ పరువు మొత్తం తీసేసింది. మన సౌత్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంతో మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయి. అలాంటి ఎంతో పేరున్న కుటుంబాన్ని బజారుకీడ్చింది కాంగ్రెస్ మహిళా మంత్రి కొండా సురేఖ..


తన ఆస్తులు కాపాడుకోవడం కోసం నాగార్జున తన కోడల్ని కేటీఆర్ దగ్గరికి పంపించడానికి రెడీ అయ్యారు అంటూ ఆమె మాట్లాడిన మాటలు వివాదానికి గురయ్యాయి. దీంతో సినీ లోకం మొత్తం ఒక్కసారిగా భగ్గుమంది.. అయితే సినిమాల్లో రాణిస్తూ ఎంతోమందిని అలరించే ఈ కథానాయికలపై ఎందుకు ఈ రాజకీయ నాయకులు చిన్నచూపు చూస్తున్నారని చాలామంది అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. మొన్న ఆ మధ్యకాలంలో సీనియర్ నటి త్రిషపై కూడా ఇలాంటి కామెంట్సే చేశారు.. తమిళనాడు రాజకీయ నాయకుడు అన్నా డిఎంకే పార్టీలోని ఏవి రాజు త్రిష పై షాకింగ్ కామెంట్లు చేశారు. జయలలిత మరణించాక పనీర్ సెల్వం పార్టీతో మా పార్టీ వాళ్లు కలవకుండా ఉండడం కోసం ఎన్నో రకాల చర్యలు చేశారు. ఇందులో భాగంగా సలెం పశ్చిమ ఎమ్మెల్యే జి వెంకటాచలం కి త్రిష తో గడిపే ఆఫర్ ఇచ్చారు.

 త్రిష కి 25 లక్షలు ఇచ్చి ఆ రాత్రి వెంకటాచలంతో గడపాలని ఓ రిసార్ట్లో రూమ్ బుక్ చేశారు అంటూ ఏవి రాజు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యాఖ్యలను త్రిష తీవ్రంగా ఖండిస్తూ మీ నీచ రాజకీయాల కోసం సెలబ్రిటీలను దిగజార్చకండి అని వార్నింగ్ ఇచ్చింది.ఇక ఈయన మాటలపై చాలామంది భగ్గుమన్నారు.అలాగే నటుడు మన్సూర్ అలీ ఖాన్ కూడా త్రిషతో నాకు బెడ్ రూమ్ సీన్ రేప్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను. కానీ అది జరగలేదు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈయన మాటలపై కూడా సెలబ్రిటీలందరూ భగ్గుమన్నారు. ఇలా ఆనాడు త్రిష కి జరిగిన అవమానమే ఈనాడు సమంతకు జరిగింది. దీంతో సినిమాల్లోని కథానాయకులపై ఎందుకు రాజకీయ నేతలకు ఇంత కక్ష..వారి పరువు ఎందుకు బజారుకీడుస్తున్నారు..అంత చిన్నచూపా అంటూ ఈ మాటలు మాట్లాడే వారిని నిలదీస్తున్నారు నెటిజెన్లు

మరింత సమాచారం తెలుసుకోండి: