ఎన్నో కలలు కని ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ సాధించిన హీరోయిన్లపై నిరాధార ఆరోపణలు చేయడం ఎంతవరకు రైట్ అని ఆయా హీరోయిన్ల తల్లీదండ్రుల క్షోభ అర్థం కాదా అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సమంత సోషల్ మీడియా వేదికగా తాను క్లారిటీ ఇవ్వగా రకుల్ ప్రీత్ సింగ్ సైతం ఒకింత ఘాటుగా క్లారిటీ ఇవ్వడం గమనార్హం. సమంత, రకుల్ తమ గురించి వచ్చిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని పేర్కొన్నారు.
సమంత, రకుల్ రెమ్యునరేషన్లు 3 నుంచి 6 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నాయి. సమంత, రకుల్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించిన నేపథ్యంలో ఇకపై ఈ హీరోయిన్ల గురించి విమర్శలు చేసేవాళ్లు సైతం సైలెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సమంత, రకుల్ సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉన్నారు.
సినిమా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభిస్తున్న నేపథ్యంలో సమంత, రకుల్ మీడియా ముందుకు వచ్చి ఈ ఘటనల గురించి రియాక్ట్ అయితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సమంత, రకుల్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. సమంత, రకుల్ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సమంత త్వరలో మా ఇంటి బంగారం మూవీ షూటింగ్ తో బిజీ కానున్నారు. సామ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.