* సమంత ఇష్యూ పై ఘాటుగా స్పందించిన ఎన్టీఆర్

* అత్త ఆ విషయంలో ఆ ఫైర్ ఏమైందంటూ అభిమానులు ఆగ్రహం

* అక్కినేని ఫ్యామిలీ పైనే ఎందుకంత ప్రేమ..


తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ దారుణమైన వ్యాఖ్యలు నాగార్జున ఘాటుగానే స్పందించారు.. అంతే కాదు కొండా సురేఖ పై పరువు నష్టం దావా కూడా వేశారు..హీరోయిన్ సమంత సైతం రాజకీయాలలోకి నన్ను లాగొద్దు.. నా విడాకుల విషయం పూర్తిగా నా వ్యక్తిగతం దానిలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని ఆమె చెప్పుకొచ్చింది. దీనితో కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పారు..కేటిఆర్ ని విమర్శించే నేపథ్యంలో తమ పేరు తీసుకురావడం జరిగింది.. మిమ్మల్ని ఇబ్బంది కలిగించి ఉంటే నా వ్యాఖ్యలు వెనక్కుతీసుకుంటున్నా అని తెలిపారు.. అయితే ఈ ఇష్యూ పై  టాలీవుడ్ ప్రముఖులు కాస్త ఘాటుగానే స్పందించారు.. ఈ విషయంలో ముందుగా స్పందించిన స్టార్ హీరో ఎన్టీఆర్.. అక్కినేని కుటుంబం తనకి చాలా దగ్గరి కుటుంబం కావడం అలాగే సమంతతో ఎన్టీఆర్ కి మంచి బాండింగ్ ఉండటంతో ఎన్టీఆర్ కొంచెం ఘాటుగానే స్పందించారు..మంత్రి కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని  ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలని ఆయన హితవు పలికాడు.. ఎన్టీఆర్ రెస్పాన్స్ వచ్చిన తరువాత టాలీవుడ్ ప్రముఖులు అంతా కూడా స్పందించడం మొదలు పెట్టారు..అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇదే విషయంపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్‌ తీరుపై మాత్రం కొందరు నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు. అందుకు కారణం ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలే..


ఏపీలో గత ప్రభుత్వం జగన్  హయాంలో చంద్రబాబు నాయుడిని, ఆయన భార్య భువనేశ్వరిని అవమానించినప్పుడు యావత్తు దేశం అంతా ఖండించింది. కానీ ఎన్టీఆర్ మాత్రం చాలా లౌక్యంగా మాట్లాడి వెంటనే ఆ ఇష్యూ పై సైలెంట్  అయ్యాడు.తన అత్తను అవమానించిన వారి పేర్లు తెలిసిన కూడా వారిని నిందించకుండా ఎన్టీఆర్ స్పందించిన తీరు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.. భువనేశ్వరిని అవమానించిన వారు ఒక దశలో జూనియర్ ఎన్టీఆర్ స్నేహితులు కావడంతో కావాలనే ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదని ఎన్టీఆర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి...కానీ ఇప్పుడు సమంతను మంత్రి కొండా సురేఖ ఏమీ అనకపోయినా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. అప్పటి మంత్రి కేటీఆర్ ఒత్తిడి తెస్తే సమంత నిరాకరించిందని మంత్రి చెప్పుకొచ్చారు.కానీ అప్పటిలో ఏపీ అసెంబ్లీలో మహిళలపై నేరుగానే వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ పేలవంగా స్పందించారు. తనకు అత్త వరుస అయ్యే మహిళకు అవమానం జరిగితే నోరు మెదపలేని ఎన్టీఆర్ ఇప్పుడు సమంతను మంత్రి ఏమీ అనకపోయినా ఘాటుగా స్పందించాడు. ఇదే ఇప్పుడు నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ పై కోపం తెప్పిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: