తెలుగు సినీ పరిశ్రమలో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో సమంత ఒకరు. ఇకపోతే ఈమె స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన కుటుంబాలలో ఒకటి అయినటువంటి అక్కినేని కుటుంబానికి సంబంధించిన నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లాడింది. ఇక ఎంతో కాలం పాటు ప్రేమించి ఒకరినొకరిని అర్థం చేసుకున్న తర్వాతే వీరు వివాహం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరికి వారు బ్రతుకుతున్నారు.

ఇకపోతే తాజాగా రాజకీయ నాయకురాలు అయినటువంటి కొండా సురేఖ ... సమంత , నాగ చైతన్య విడిపోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు అయినటువంటి కేటీఆర్ కారణమని చెప్పింది. అలాగే ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలి అంటే సమంత ను నా దగ్గరకు పంపాలి అని ఆయన డిమాండ్ చేసినట్లు , దానితో సమంత ని వెళ్లాలి అని నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు అని , కానీ సమంత వెళ్ళను అంది అని , వెళ్తే వెళ్ళు లేకపోతే బయటకు వెళ్ళు అని వారు అన్నట్లు , దానితో ఆమె డైవర్స్ ఇచ్చినట్లు కొండా సురేఖ కామెంట్స్ చేసింది. ఇక ఈ కామెంట్ సంచలనం అయ్యాయి. అలాగే అనేక మంది కొండా సురేఖ చేసింది తప్పు అని స్పందించారు. దానితో ఆమె సమంత కి క్షమాపణలు చెప్పింది. ఇలా సమంతను , అక్కినేని ఫ్యామిలీని అనేక దూషణలను చేయడంతో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎంతో మంది సెలబ్రిటీలు ఇది తప్పు అని కొండా సురేఖ పై ఫైర్ అవుతున్నారు.

ఇకపోతే గతంలో కూడా కొన్ని సందర్భాలలో కొంత మంది పై ఇలాంటి కామెంట్స్ చేసిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఆ సమయాలలో ఇంత పెద్ద స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమ నుండి సెలబ్రెటీలు బయటకు రాలేదు అని జనాలు అభిప్రాయ పడుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంఘటన ఏదైనా వస్తే కచ్చితంగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అందరూ నటీనటులు బయటకు వచ్చి వారికి సపోర్ట్ చేయాలి అని జనాలు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: