అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు కాస్త ఆందోళన పడినప్పటికీ ఆ తర్వాత వైద్యులు వెంటనే రజనీకాంత్ హెల్త్ అప్డేట్ ని విడుదల చేయడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. రజనీకాంత్ గుండెకు సంబంధించి రక్తనాళాల వాపు వచ్చిందని వీటి వల్లే ఆయన ఆసుపత్రికి చేరారని అందుకు స్టెంట్ అమర్చామని తెలిపారు.. ఆరోగ్యం కుదుటపడడంతో నిన్నటి రోజున డిశ్చార్జ్ చేశారట. అయితే రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా కోరుకోవడం జరిగింది.
ఆస్పత్రిలో చికిత్స తీసుకొని రజనీకాంత్ మూడు రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నారట. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటూ వైద్యులు తెలియజేశారు. కానీ రజనీకాంత్ ఒక వారం రోజులపాటు ఎలాంటి షూటింగ్లో పాల్గొనకూడదని సూచించారు. గత కొంతకాలంగా రజినీకాంత్ వరుసగా చిత్రాల షూటింగ్లో పాల్గొంటూనే ఉన్నారు. ఈనెల 10వ తేదీన రజనీకాంత్ నటించిన వెట్టయాన్ సినిమా విడుదల కాబోతోంది కానీ ఇటీవలే ఒక వ్యక్తి కోర్టులో కూడా ఈ సినిమాలోని సన్నివేశాల పైన కేసు వేసినట్లు సమాచారం. మరో సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో కూలి అనే చిత్రాలు నటిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ చేయడానికి మరో కొన్ని వారాలు సమయం పడుతుందని చెప్పవచ్చు.