ఇండస్ట్రీలో స్టార్ పోజిషన్ లోకి రావాలని ఎన్నో కలలతో అడుగు పెట్టింది నటి వీణ.. కానీ ఇమే అనుకున్నంతగా అవకాశాలు రాకపోవడంతో వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ఉన్నది.వీణ బుల్లితెర పైన జనని అనే సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలా సీరియల్స్ లో పలు రకాల కమర్షియల్ యాడ్లలో కూడా నటిస్తూ తన లైఫ్ను లీడ్ చేస్తోంది వీణ.. దీంతో ఆమె మద్యానికి కూడా అలవాటు పడిందట.. అల తన కెరియర్ ముందుకు సాగుతున్న సమయంలో వీణ జీవితంలోకి మదన్ అనే వ్యక్తి వచ్చారట.. ఆ పరిచయం ప్రేమగా మారిందట.. అలా తరచూ మదన్, వీణ ఇద్దరూ కూడా ఫోన్లలో మాట్లాడుకునేవారు కలిసి ఎంజాయ్ చేసేవారట.


ఇలా కొంతకాలం వీరిద్దరూ రిలేషన్ ని కూడా మెయింటైన్ చేయడం జరిగిందట. ఆ తర్వాత వీణ, మదన్ ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిందట. కానీ వీణ ప్రవర్తన మదన్ కు రోజురోజుకి అనుమానంగా మారింది. వీణ తనతోనే కాదు గతంలో చాలామంది అబ్బాయిలతో సన్నిహితంగా ఉండడాన్ని తాను గమనించారట. తనకు సెట్ కాదని భావించిన మదన్.. అందులో అలా మద్యం తాగుతున్న అమ్మాయిని వివాహం చేసుకోవడం కుటుంబ సభ్యులకి ఇష్టం లేకపోవడంతో ఈ విషయాన్ని వీణ ముందే చెప్పేసారట.



కానీ వీణ మాత్రం వినకుండా.. మదన్ ఇంటికి వెళ్లి బ్లేడుతో చెయ్యి కోసుకున్నదట ఈ నటి.. దీంతో కాస్త భయపడిన మదన్ మంగళవారం సాయంత్రం ఫోన్ చేసి   నటి ఇంటికి ఆహ్వానించిందట.అనంతరం వీరిద్దరూ కూడా మద్యం సేవించి పెళ్లి విషయాన్ని తీసుకురావడంతో వీరిద్దరి మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. దీంతో మదన్ వాష్ రూమ్ కి వెళ్తున్నానని చెప్పి మరొక ఇంట్లోకి వెళ్లి మరి గదిలో ఊరివేసుకున్నారట. మదన్ ఎంతసేపుకి రాకపోవడంతో వీణ గమనించి తన ఇంట్లోనే మరొక గదిలోకి వెళ్లి చూడగా తన బాయ్ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకున్నాడని విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పోలీసులకు అందించగా ఈ నటి హింసించడం వల్లే తన కొడుకు మరణించారంటూ మదన్ తల్లిదండ్రులు ఈ నటి పైన ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: