సంక్రాంతి తర్వాత సినిమా వాళ్లకు పెద్దగా కలిసి వచ్చేది దసరా.. మన తెలుగు రాష్ట్రాల్లో దసరాకి వచ్చే సినిమాల హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది.  స్కూల్స్‌కు, కాలేజీలకు పది రోజులు సెలవులు ఇచ్చే సమయం కూడా ఇదే.. దీంతో ఏట భారీ ఎత్తున స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చేవి .. థియేటర్లు దసరా ధమాకాలు అంటూ సినిమాలు హల్చల్ చేస్తుంటాయి. అభిమానుల కోలహాలంతో ఎంతో కలకలాడుతూ ఉండేవి.

కానీ ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో దసరా చాలా చెప్పగానే కనిపిస్తుంది. ఒక్క స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ కు లేదు. మీడియం హీరో గోపీచంద్ హీరోగా వస్తున్న విశ్వం రిలీజ్ అవుతుంది. ఇది చాలా కాలంగా సక్సెస్ లేని శీను వైట్ల డైరెక్షన్లో వస్తున్న సినిమా. అలాగే గోపీచంద్ కూడా చాలా కాలంగా సరైన హిట్టు లేదు. అలాంటి ఇద్దరు ఈసారి దసరాకి ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.

ఇక అక్టోబర్ 11న ఈ సినిమా ధియేటర్లోకి రానుంది. దీనికి ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వెట్ట‌యాన్ 10న రిలీజ్ అవుతుంది. ఇది తెలుగు సినిమా కాదు తమిళ సినిమా కాబట్టి దీన్ని అంతగా లెక్కలోకి తీసుకోవాల్సిన పనిలేదు. కానీ సూపర్ స్టార్ మాత్రం ఫుల్ జోష్‌ లో ఉన్నారు. వరుస విజయాలతో భారీ అంచనాల న‌డుమా వెట్ట‌యాన్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఒక్క తెలుగులోనే కాదు కోలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతున్న ఒకే ఒక్క స్టార్ హీరో సినిమా కూడా ఇదే. ఇక బాలీవుడ్ లో కూడా అక్కడ కొన్ని రాష్ట్రాలో దసరా భారీగా జరుగుతుంది.  ప‌శ్చిమ‌బెంగాల్, అస్సాం, ఒడిశా వంటి రాష్ట్రాలు ముఖ్యంగా జరుపుకునే పండుగ కానీ హిందీ సినిమాలు కూడా రిలీజ్ కి ఏమీ లేవు.. అలియాభ‌ట్ న‌టించిన జిగ్రా అక్టోబ‌ర్ 2న రిలీజ్ అయింది. అక్టోబ‌ర్ 11న మాత్రం రాజ్ కుమార్ రావ్, త్రిప్తీడిమ్రీ జంట‌గా న‌టించిన విక్కీ విద్యా కాహూ వాలా వీడియో చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలే ద‌స‌రా బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డుతున్నాయి. ఈ దసరా సినిమా ప్రియులకు గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
[10:52 am, 4/10/2024] Leela:

మరింత సమాచారం తెలుసుకోండి: