2024.. బాక్సాఫీస్ రూ.100 కోట్ల కలెక్షన్లు రాబెట్టిన సినిమాల లిస్ట్ ఇదే..!
ఇక ఇదే క్రమంలో ఈ సంవత్సరం ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చిన సినిమాల్లో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన సినిమాల జాబితా చూసుకుంటే హిందీ తో పాటు తెలుగు, తమిళ , మలయాళీ భాషలు నుంచి వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయ.. ఇక బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలలో తొమ్మిది సినిమాలు ఏడాది రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. ఇక వాటిలో శ్రద్ధా కపూర్ స్త్రీ 2 టాప్ లో ఉంది. ఇక దీని తర్వాత హృతిక్ రోషన్ ఫైటర్, షాహిద్ కపూర్, కృతి సనన్ రొమాంటిక్ డ్రామా ‘తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా’, ‘ఆర్టికల్ 370’, అజయ్ దేవగన్ ‘సైతాన్’, ఫీమేల్ సెంట్రిక్ మూవీ ‘క్రూ’, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ‘బడే మియాన్ చోటే మియాన్’, విక్కీ కౌశల్ ‘బ్యాడ్ న్యూస్’, చిన్న సినిమా ‘మంజ్య’ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ఏడాది బాలీవుడ్ ని కొంత సేఫ్ పొజిషన్ లో నిలబెట్టాయి.
ఇక మన టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలలో ఆరు సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. ఇక వాటిలో అత్యధిక కలెక్షన్ అందుకున్న చిత్రం కల్కి, అలాగే ఎన్టీఆర్ దేవర రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లకు దగ్గరలో ఉంది, అలాగే ప్రశాంత్ వర్మ హనుమాన్, సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్, నాని సరిపోతా శనివారం సినిమాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్ అందుకున్న సినిమాలుగా నిలిచాయి. ఇక కోలీవుడ్ లో 5 సినిమాలు 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించాయి. వాటిలో దళపతి విజయ్ ‘ది గోట్’, విజయ్ సేతుపతి ‘మహారాజ’, ‘అరణ్మణై 4’, ధనుష్ ‘రాయన్’, కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘ఇండియన్ 2’, ‘ది గోట్’ సినిమాలు కమర్షియల్ ఫ్లాప్ గా నిలిచాయి. హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్యలో వచ్చిన ఈ సినిమాలు ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయాయి. నెక్స్ట్ మలయాళీ ఇండస్ట్రీలో ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘ప్రేమలు’, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’, ఫాహద్ ఫాజిల్ ‘ఆవేశం’ సినిమాలు 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించాయి. పంజాబీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘జాట్ అండ్ జూలియట్ 3’ మూవీ 100 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. హాలీవుడ్ సినిమాలైనా ‘డెడ్ పూల్ అండ్ వుల్వరైన్’, ‘గాడ్జిల్లా ఎక్స్ కాంగ్’ సినిమాలు ఇండియాలో 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించాయి.