అలా కంటిస్టెంట్లు గాయపడిన వారిలో త్రివిక్రమ్ తో పాటు గోల్డ్ సురేష్ కూడా ఉన్నట్లు సమాచారం. బిగ్బాస్ హౌస్ మొత్తం కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురి అయ్యారు. వీరందరూ త్వరగా కోలుకోవాలని కూడా లోపల ఉండే కంటెస్టెంట్స్ కోరుకుంటున్నారు. టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి వీరి మధ్య పోటీ పెట్టారట బిగ్బాస్. ఇందులో భాగంగానే ఒక బంతిని తీసుకొని త్రివిక్రమ్ పరిగెత్తుతూ ఉండగా ఉన్నటువంటి కింద పడిపోయారు. దీంతో అతడిని అక్కడ ఉండే కన్వెన్షన్ రూమ్ కి తీసుకువెళ్లాలని బిగ్ బాస్ వెల్లడించారు.. తీవ్ర ఇబ్బందిలను గుర్తించిన బిగ్బాస్ వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
అదేవిధంగా అదే టాస్క్ లో గోల్డ్ సురేష్ కు కూడా గాయాలు కావడంతో ఆయనను కూడా హాస్పిటల్ కి చేర్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే కన్నడ సినీ పరిశ్రమలో ఇలా కంటెస్టెంట్స్ గాయపడడం ఇదేమి మొదటిసారి కాదు అని గత సీజన్ లో కూడా చాలామంది కంటెస్టెంట్స్ గాయాల పాలయ్యారట. ఒక లేడీ కంటెస్టెంట్ ఏకంగా తన కన్నుకి చాలా దెబ్బ తగలడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది
ఇప్పుడు మళ్లీ ఇలా ఇద్దరు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ ప్రారంభం మొదటి వారంలోనే ఆసుపత్రి పాలయ్యాల చేసింది. మరి రాబోయే రోజుల్లో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ జాగ్రత్త పడతారో లేదో చూడాలి.