టాలీవుడ్ VS కొండా సురేఖ..

ట్విట్టర్ లో వైరల్ అవుతున్న #FilmIndustryWillNotTolerate   అనే హ్యాష్ టాగ్ ..

అసలేం జరిగిందంటే..

తాజాగా మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ ఇండస్ట్రీ పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసారు.. ఏమని అంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోయిన్స్ కి ktr డ్రగ్స్ అలవాటు చేసారని..  అయన కారణంగానే చాల మంది హీరోయిన్స్ ఇండస్ట్రీ కి దూరం అయ్యారని.. అలాగే ముఖ్యంగా సమంత అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం కూడా కేటీర్ అని ఆమె అన్నారు ..   ఈ రచ్చ ఎప్పటినుండో జరుగుతుంది..  కానీ ఎవ్వరు బయట పెట్టడం లేదు అని ఓపెన్ కామెంట్స్ చేశారు.  ఇలా  కొండా సురేఖ తనకి ఎటువంటి సంబంధం లేని టాలీవుడ్ ఇండస్ట్రీ పై ఇలాంటి కామెంట్స్ చేయడం తో సినీ ఇండస్ట్రీ మొత్తం ప్రస్తుతం తనపై భగ్గు మంటుంది.  అందులో భాగంగానే ఇప్పటికే ఈ విషయమై సినీ తారలందరూ స్పందించారు ..

అయితే  కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే అక్కినేని నాగార్జున స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.  అలాగే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు.  అటు సమంత సైతం స్పందించింది.  నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ ఫైర్ అయ్యింది.   నాగచైతన్య కూడా కొండా సురేఖ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదం పై కేవలం  అక్కినేని కుటుంభం మాత్రమే కాకుండా టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది.  ఇప్పటికే  Jr ఎన్టీఆర్ , నాని, ప్రకాష్ రాజ్, మహేష్ బాబు అమల,  చిరంజీవి  వంటి స్టార్ హీరోస్ తో పాటు చాల మంది చిన్న ఆర్టిస్ట్ లు సైతం స్పందించారు.

 దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా #FilmIndustryWillNotTolerate  అనే హ్యాష్ టాక్ వైరల్ చేస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ తో పాటు చాలా మంది సినీ ప్రముఖులు సైతం తమ తమ సోషల్ మీడియా వేదికగా ఈ హ్యష్  ట్యాగ్ తో అక్కినేని కుటుంబానికి సపోర్ట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఇకపై టాలివుడ్ సినీ ఇండస్ట్రీ, టాలీవుడ్ సినీ ప్రముఖుల పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే అస్సలు సహించేదే లేదు అని ఇప్పటికే సినీ ప్రముఖులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ విషయాన్ని ఖండిస్తూ #FilmIndustryWillNotTolerate సోషల్ మీడియాలో ఈ టాగ్ ను వైరల్ చేస్తున్నారు..!!




మరింత సమాచారం తెలుసుకోండి: