సినిమా ఇండస్ట్రీ లో హిట్లు అనేవి అత్యంత కీలకన్పాత్రను పోషిస్తూ ఉంటాయి . ఎవరికైతే హిట్లు భారీ గా వస్తూ ఉంటాయో వారికే సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు అద్భుతమైన స్థాయిలో దక్కుతూ ఉంటాయి . ఎవరికైతే విజయాలు పెద్దగా దక్క వో వారికి అవకాశాలు కూడా భారీ స్థాయిలో రావు . కానీ కొంత మంది మాత్రం ఈ ఫార్ములాకు వ్యతిరేకం గా కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు. విజయాలు లేకపోయి న వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉంటారు . అలాంటి వారు తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇద్దరు ముద్దుగుమ్మలు ఉన్నారు.

వారు ఎవరో తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి చాలా కాలమే అవుతున్న కావ్య దాపర్ కి ఒక్క కమర్షియల్ విజయం కూడా దక్కలేదు. కానీ ఈమె నటించిన ప్రతి సినిమాలోనూ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను భాగానే ఈ బ్యూటీ ఆకట్టుకుంటుంది. దానితో ఈమెకు వరుసగా అపజయాలు దక్కిన కూడా సినిమా అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈమె నటించిన సినిమాలు చాలానే విడుదల అవుతూ వస్తున్నాయి. ఈమె కొత్త కాలం క్రితమే డబల్ ఇస్మార్ట్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది.

ఇక అక్టోబర్ 11 వ తేదీన ఈమె నటించిన విశ్వం సినిమా విడుదల కాబోతోంది. ఇదే స్థాయిలో కెరీర్లు ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో భాగ్య శ్రీ బోర్స్ ఒకరు. ఈమె మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయినా కూడా ఈమెకు వరుస సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇలా విజయాలు లేకపోయినా వీరిద్దరికి మంచి క్రేజీ సినిమాలలో అవకాశాలు వరుసగా దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: