ఫస్ట్ వీక్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో దేవర మూవీ ఏ స్థానంలో ఉంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మొదటి వారం రోజులు పూర్తి అయ్యేసరికి రెండు తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ కలెక్షన్ వసూలు చేసిన సినిమాల లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 187.65 కోట్ల షేర్ కలెక్షన్లతో మొదటి స్థానంలో నిలవగా , ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా 135.32 కోట్ల షేర్ కలక్షన్లతో రెండవ స్థానంలో నిలిచింది. 

ఇక ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 128.54 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది. ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర మొదటి బాగం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 

ఇకపోతే ఈ సినిమా మొదటి వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 122.45 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ నటించి రెండు పాత్రలలోనూ తనదైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీ ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: