నందమూరి నట సింహం బాలకృష్ణ  వారసుడు సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని బాలయ్య ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు.. బాలయ్య గత కొన్నేళ్లుగా త్వరలోనే నా తనయుడిని లాంచ్ చేస్తున్న అని ఇప్పటికే చాలా సార్లు చెప్పేసాడు.. కానీ కుదర్లేదు తాజాగా బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఈ ఏడాదే ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఈ సినిమా మొదలు కానుండగా ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం.అయితే మొదటి సినిమాతోనే మోక్షజ్ఞకు అనుకోని సవాళ్లు ఎదురుకానున్నాయని తెలుస్తుంది.. మోక్షజ్ఞ నటిస్తున్న మొదటి మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు వేరే లెవెల్ లో వున్నాయి.. ఈ మూవీ ఏకంగా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం. 

అయితే మోక్షజ్ఞ మొదటి మూవీ గండం నుంచి బయటపడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం అంత సులువు అయితే కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ కు స్టార్ స్టేటస్ రావాలంటే ఇప్పటికే పాన్ ఇండియా స్టేటస్ ను అందుకున్న హీరోల తో సమానంగా మార్కెట్ ను పెంచుకోవాల్సి అయితే వుంది.మోక్షజ్ఞ యాక్టింగ్ లో సైతం ఇతర హీరోలకు ధీటుగా పోటీ ఇవ్వాల్సి వుంది.అయితే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ లో బాలయ్య కూడ ముఖ్య పాత్ర లో నటిస్తుండటం సినిమాకు మరింత ప్లస్ కానుంది.మోక్షజ్ఞ లుక్స్ కు మంచి మార్కులు పడుతుండగా మోక్షజ్ఞ ఇదే లుక్ ను మెయింటైన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.. మోక్షజ్ఞ తన మొదటి మూవీ కోసం బాలయ్య నెక్స్ట్ లెవెల్ స్టోరీ డిజైన్ చేయించినట్లు సమాచారం.అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ డైలాగ్ డెలివరీ ఏ విధంగా ఉంటుందో అని చర్చించు కుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: