టాప్ హీరోలు అందరికీ ఏదో ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. మెగా స్టార్ పవర్ స్టార్ సూపర్ స్టార్ ఇలా రకరకాల పేర్లతో అభిమాన హీరోలను వీరాభిమానులు ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. హీరో సందీప్ కిషన్ ఇండస్ట్రీలోకి వచ్చి పుష్కర కాలం దాటిపోతున్నప్పటికీ అతడి కెరియర్ కు సంబంధించి ఒక సూపర్ హిట్ ఇప్పటివరకు రాలేదు.



అయినప్పటికీ అతడితో సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు వస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా నక్కిన త్రీనాధరావు దర్శకత్వంలో ఈహీరో ‘మాజాక’ అన్న మూవీలో నటిస్తున్నాడు. ఈమూవీ వచ్చే సంక్రాంతి రేస్ లో విడుదల అవుతుందని సంకేతాలు రావడం ఒక సంచలనం అయితే ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సందీప్ కిషన్ పేరుకు ముందు పెట్టిన ట్యాగ్ లైన్ మరింత షాకింగ్ గా మారింది.



పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ అంటూ ఈమూవీ యూనిట్ సభ్యులు విడుదల చేసిన పోస్టర్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. పీపుల్ స్టార్ అన్న పేరు వినగానే ఎవరికైనా వెంటనే ఆర్. నారాయణమూర్తి గుర్తుకు వస్తాడు. సమాజంలోని అట్టడుగు వర్గాలు అయిన పీడిత ప్రజల బాధల పై ఆయన గతంలో తీసిన అనేక సినిమాలు సంచలనంగా మారాయి.



అయితే గత కొంత కాలంగా సినిమా నిర్మాణానికి ఆయన దూరంగా ఉంటున్నాడు. ఈమధ్య కాలంలో ఆయన నుండి సినిమాలు రావడం తగ్గిపోవడంతో అతడికి సంబంధించిన వార్తలు మీడియాలో వినిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య సందీప్ కిషన్ కు ఆర్. నారాయణ మూర్తి ట్యాగ్ లైన్ వాడటం ఒక విధంగా షాకింగ్ న్యూస్. సాధారణంగా టాప్ హీరోల వారసులకు వారి తండ్రి ట్యాగ్ లైన్ ను వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలకు అభిమానులు మీడియా కొనసాగిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారసత్వం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన సందీప్ కిషన్ ఇప్పుడు పీపుల్స్ స్టార్ గా మారడంతో ఆర్. నారాయణ మూర్తి అభిమానులు షాక్ అవుతున్నారు..





మరింత సమాచారం తెలుసుకోండి: