సమంతకు సురేఖ క్షమాపణలు కనుక చెప్పకపోయి ఉంటే వ్యవహారం మరోలాగా ఉండేదని తెలిపింది. ఈ వ్యవహారంలో ఇక వారి జోక్యం అవసరం లేదని భావిస్తున్నట్లు మహిళా కమిషన్ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై జర్నలిస్ట్ ఆర్టివి రవి ప్రకాష్ స్పందించాడు. "నేను సిగ్గు పడుతున్నాను.... తెలుగు సాంస్కృతిలో స్త్రీలను గౌరవించడమే ప్రధానం... కానీ నేటి రాజకీయాలను చూస్తుంటే మనం చేయగలిగినదల్లా అవమానంగా భావించడమే. స్త్రీ అయిన తర్వాత ఒక స్త్రీని అవమానించడం, అంతేకాకుండా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం, మనం ఎంతవరకు రాజకీయ అధోగతిలో మునిగిపోతున్నామో చూపిస్తుంది" అంటూ ట్వీట్ చేశారు.
అయితే ఈ ట్వీట్ పై స్పందించిన పూనమ్ కౌర్ సంచలన కామెంట్లు చేసింది. "మీ ప్రోగ్రామ్స్ వలన నా జీవితం ఏం అయ్యింది. మీకేం తెలుసు అని ఒక దళిత బిడ్డను బలి పశువును చేశారు. మీ రాజకీయ లాభాల కోసం చేసింది అంత మర్చిపోయారా" అంటూ పూనమ్ కౌర్ రాసుకోచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సంచలనంగా మారుతుంది. ఇది ఇలా ఉండగా.. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ కూడా పరువు నష్టం దావా వేయడం జరిగింది. తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే.. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెడుతున్నారు.