అయితే ఇప్పుడు ఈ మూవీ తర్వాత మరో రెండు సినిమాలకు కూడా సైన్ కూడా చేసేసారు ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యూచర్ లైనప్ చూస్తూ ఉంటే. ఇక నేరుగా తెలుగు సినిమా చేయడం కష్టమేనేమో అనే భావన అభిమానులకు కూడా కలుగుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఒప్పుకున్న మరో రెండు సినిమాలు ఇంకా పూర్తి కానే లేదు. ఇప్పుడు మరో సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళ్ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ రజనీకాంత్ తో జైలర్ అనే సినిమా తీసి హిట్టు కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ తో ఎన్టీఆర్ సినిమా ఓకే అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నెల్సన్ ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ వినిపించడంతో.. తారక్ కి కూడా బాగా నచ్చేసి ఓకే చెప్పేసాడు అనే టాక్ వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం హిందీలో వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ నెల్సన్ దిలీప్ కుమార్ తో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇలా ఈ మధ్య కాలంలో తమిళ డైరెక్టర్ లతో తమిళ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అందుకే వారికి ఎక్కువగా అవకాశాలు కూడా ఇస్తున్నాడు. దీంతో రానున్న రోజుల్లో తెలుగులో సినిమాలకు తారక్ ఏమైనా బ్రేక్ తీసుకుంటాడా అనే చర్చ కూడా సాగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.