ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ధర్మం వైపు నిలబడుతూ.. తన వ్యక్తిత్వంతో కూడా ఇంకొంతమంది అభిమానులను సంపాదించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ను అందరూ పవర్ స్టార్ అని,పవన్ కళ్యాణ్ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఆయన అన్నయ్యలు కళ్యాణ్ బాబు అని పిలుచుకోవడం చూస్తూ ఉంటారు. కానీ అసలు పవన్ కళ్యాణ్ నిజమైన పేరు ఏంటి.. తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారు అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఇటీవల ఈ విషయంపై ఆసక్తికర విషయాన్ని చెప్పింది పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి.
ఇటీవల ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలను అందరితో పంచుకుంది. పవన్ కళ్యాణ్ కి మీరు చిన్నప్పుడు పెట్టిన పేరు అదేనా అంటూ అడిగితే కాదు అంటూ సమాధానం చెప్పింది అంజనాదేవి. శ్రీ కళ్యాణ్ కుమార్ అనే మేము చిన్నప్పుడు పేరు పెట్టాం. అది వెంకటేశ్వర స్వామి పేరు. ఇక ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాక అది పవన్ కళ్యాణ్ గా మారింది అంటూ చెప్పుకొచ్చారు అంజనాదేవి. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ.. రాజకీయాలు మనకెందుకు సినిమాలు చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పా. రెండు బ్యాలెన్స్ చేస్తాను అని నాతో చెప్పాడు కళ్యాణ్. ఇక ఈ విషయంలో నేను ఎప్పుడు వాదించేదాన్ని కాదు. వాళ్ల ఇష్టానికి వదిలేసేదాన్ని. ఇక పదేళ్లుగా కుటుంబాన్ని వదిలేసి ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా తన మార్క్ చూపిస్తున్నాడు అంటూ అంజనాదేవి చెప్పుకొచ్చారు.