- నార్త్ అమెరికా లో 5.5 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లో చేరిన దేవ‌ర‌
- లాంగ్ ర‌న్ లో 6 క్రాస్ చేసి 7 మిలియ‌న్ డాల‌ర్ల వైపు ప‌రుగులు


- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన దేవర మూవీ.. లాంగ్ ర‌న్‌లో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ప్రతి ఒక్కరు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కొసరాజు హరికృష్ణ , మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా సినిమాను నిర్మించారు. ఇదిలా ఉంటే దేవర సినిమాకు పది రోజులకు ముందు నుంచే అమెరికా లో పెద్ద హంగామా మొదలైంది. అసలు ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే దేవర అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల వసూళ్లు కొల్లగొట్టింది.


ఇక ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్‌లో దేవర రికార్డుల వర్షం కురిపిస్తోంది. నార్త్ అమెరికాలో దేవర మాస్ ర్యాంపేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే అక్కడ 5.5 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింద‌ని.. దేవర ఒకటి, రెండు రోజుల్లో ఏకంగా ఆరు మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరబోతోంది. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన సినిమా కావడంతో నార్త్ అమెరికా ఆడియన్స్ అయితే ఎన్టీఆర్‌కు ఫిదా అయిపోతున్నారు అని చెప్పాలి. ఎన్టీఆర్‌కు జోడిగా జన్మికపూర్ హీరోయిన్గా నటించగా.. సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా నటించారు. ఇక ఈ సినిమా విజ‌యంతో జోష్ లో ఉన్న ఎన్టీఆర్ త్వ‌ర‌లోనే వార్ 2 సినిమా తో పాటు ప్ర‌శాంత్ నీల్ సినిమాలో న‌టించ‌నున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: