తాజాగా వచ్చిన దేవరకొండ పాన్ ఇండియా రేంజ్‌లో అదరగొడుతూ ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమా ఫైనల్ బాక్సాఫీస్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.500 కోట్ల వసూళ్లు దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాక్షన్ బాగా చేస్తారు. డైలాగులు బాగా చెబుతాడు. రౌద్ర రసంలో అదరగొడతాడు. ఫైట్లు ఇరగదీస్తాడు. డ్యాన్సులు కుమ్మేస్తాడు. ఎన్టీఆర్ నవ రసాలను అద్భుతంగా పలికిస్తాడు. అయితే ఎన్టీఆర్ రొమాన్స్ విషయంలో కాస్త వీక్ అట. ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ స్వయంగా చెప్పారు. మిగిలినవి అన్ని బాగా చేసిన.. రొమాన్స్ దగ్గరికి వచ్చేసరికి కాస్త తడబడుతూ ఉంటాడట.
అయితే రొమాన్స్ చేసే విషయంలో కాస్త బాగా చేస్తేనే ప్రేక్షకులు బాగా చూస్తారు అని కొరటాల పదేపదే ఎన్టీఆర్‌కు నచ్చ చెబుతూ రొమాన్స్ సీన్లు తెరకెక్కించేవారట. మరీ ముఖ్యంగా దేవర సినిమాలో జాన్వీకపూర్, ఎన్టీఆర్ మధ్య వచ్చే రొమాన్స్ విషయంలో తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ సీన్లు తెరకెక్కించానని కొరటాల శివ చెప్పారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ విషయంలో ఈ కంప్లైంట్ ఒక కొరటాల శివ మాత్రమే కాదు.. గతంలో ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన దర్శకులు కూడా చెప్పారు. ఎన్టీఆర్ రొమాన్స్ దగ్గరికి వచ్చేసరికి హీరోయిన్ల ముందు కాస్త తడబడతాడు అన్నదే మేజర్ కంప్లైంట్. ఇక దేవర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్.. వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ సినిమాలలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.
[12:13 pm, 4/10/2024] V Subhash: