ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతున్నాయి. ఇక రియల్ వీడియో కంటే ఇలా ఎడిట్ చేసిన వీడియోలే ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా వీడియోలను ఎడిట్ చేసేవారు క్రియేటివిటీ చూసి అందరూ షాక్ అవుతున్నారు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారిపోతున్న పాట రా మచ్చా మచ్చా. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలోని ఈ పాట ఇటీవల విడుదలైంది. యూట్యూబ్ లో 50 మిలియన్ వ్యూస్ కూడా క్రాస్ చేసేసింది. ఇక సోషల్ మీడియా జనాలు అందరిని కూడా ఆకట్టుకుంటుంది అన్న విషయం తెలిసిందే అయితే ఇక ఈ పాటపై రామ్ చరణ్ డాన్స్ లుక్ కూడా అదిరిపోయింది.
అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన రా మచ్చా మచ్చా సాంగ్ కి ధోని వర్షన్ ఎలా ఉంటుందో తెలుసా.. ధోనీ వర్షన్ ఏంటి అని ఊహించుకోవడానికి కష్టంగా ఉంది కదా. కానీ ఇక్కడ ఒక నెటిజన్ తన క్రియేటివిటీకి పని చెప్పి ధోని వెర్షన్ తయారు చేశాడు. ఈ పాటకు సింక్ అయ్యేలా టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని క్లిప్స్ ని అభిమాని ఎడిట్ చేసి ఒక వీడియో తయారూ చేసి సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఇది కాస్త ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. ఇక ఇది చూసి ఏం క్రియేటివిటీ బాసూ.. అదిరిపోయింది అంటూ ఎంతో మంది నేటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.