అయితే ఇక ఇప్పుడు ఉన్న నేటితరం హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఇక ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా మారబోతున్నారా అంటే ఆయన చేస్తున్న పనులు మాత్రం అలాగే ఉన్నాయి. నందమూరి అనే బడా ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ ఇక త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన తారక్.. ఇక ఇటీవలే దేవర సినిమాతో తన స్టార్ డం నిలబెట్టుకున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి కేవలం సినిమాలు చేయడంలోనే కాదు మంచి పనులు చేయడంలోనూ అందరి హీరోల కంటే ముందు ఉంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. మొన్నటికి మొన్న తెలుగు రాష్ట్రాలను వరదలు ముని చెప్పిన సమయంలో చెరో రాష్ట్రానికి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఎన్టీఆర్ తర్వాతే అందరూ హీరోలు ఇలా చేయడానికి పూనుకున్నారు.
ఇప్పుడు సమంత విషయంలో కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి అక్కినేని ఫ్యామిలీ తర్వాత అక్కినేని కుటుంబానికి అండగా నిలబడుతూ మాట్లాడింది కూడా ఎన్టీఆరే. ఇక తారక్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. ఒక్కొక్కరుగా కొండా సురేఖ తీరును తప్పు పడుతూ ఉన్నారు. అయితే ఇలా సమయం వచ్చినప్పుడు సమంతకు అండగా నిలబడటం చూస్తూ ఉంటే సినిమా ఇండస్ట్రీకి ఎవరికి సమస్య వచ్చినా ఎంతో గట్టిగా నిలబడాలని తారక్ ఫిక్స్ అయ్యారు అని అర్థం అవుతుంది దీంతో ఇక ఇప్పుడు ఎన్టీఆర్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ బాధ్యతను భుజాన తీసుకోబోతున్నాడ అనే డౌట్స్ కూడా మొదలయ్యాయ్. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి.