సీనియర్ హీరోల దగ్గర నుంచి జూనియర్ హీరోల వరకు అందరితో జోడి కట్టింది. అయితే ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ తో కూడా అదుర్స్ అనే సినిమాలో నటించింది అన్న విషయం తెల్సిందే. ఈ సినిమా యావరేజ్ టాక్స్ సొంతం చేసుకున్నప్పటికీ.. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ నయనతార కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే సాధారణంగా ఎప్పుడూ చలాకీగా ఉండే హీరో తారక్ తన తోటి నటులపై పంచులు వేస్తూ కామెడీ జనరేట్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అదుర్స్ సినిమా షూటింగ్ సమయంలో తారక్ ఇలాగే తనను కామెంట్ చేశాడు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నయనతార.
షూటింగ్ జరుగుతున్న సమయంలో నయనతార మాటిమాటికి టచ్ అప్ చేసుకుంటూ ఉన్నారట. అయితే తాను టచ్ అప్ చేసుకుంటూ లిప్స్టిక్ రాసుకుంటూ ఉంటే.. తారక్ పక్కనే నిలబడి అలాగే చూస్తూ ఉన్నాడట. . అయితే ఏంటి అలా చూస్తున్నారూ అని నయనతర తారకను అడిగిందట. ఇక ఎందుకు అంత మేకప్ వేసుకుంటున్నావు అంటూ అడిగాడట తారక్. అప్పుడు నయనతార షాట్లో అందంగా కనిపించాలి కదా అని సమాధానం ఇచ్చిందట. దీంతో వెంటనే ఎన్టీఆర్ కామెంట్ చేస్తూ.. నువ్వు ఎంత మేకప్ వేసుకున్న.. జనాలు నిన్ను చూడరు. నన్నే చూస్తారు అని చెప్పాడట. ఇది విని నయనతారతో పాటు సెట్ లో ఉన్న వారందరూ కూడా సరదాగా నవ్వుకున్నారట. అయితే అదుర్స్ సినిమాలో చారి లుక్ ఎంత డిఫరెంట్ గా సరికొత్తగా ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ ఈ కామెంట్ చేయడంతో అందరూ నవ్వుకున్నారు.