నిజంగానే రజినీకాంత్ ఒకటి కాదు రెండు కాదు కనీసం 10 అడుగుల వెనక్కి వేయాల్సి వస్తుంది. అంతా దేవర మహిమే. ప్రభాస్ రాకముందు వరకు ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున రజనీకాంత్ ని ఇప్పుడు ఎన్టీఆర్ భయపడుతున్నాడా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ అంటేనే ఒకప్పుడు ఇండియాలోనే కాదు మన ఆసియాలోనే జాకీచాన్ లాంటి స్టార్స్ ని మించేలా రూ.150 కోట్ల పైన రెమ్యునరేషన్ తీసుకున్న అగ్ర హీరో.. ప్రస్తుతం ప్రభాస్ సినిమాకు రూ.300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 31 సినిమాకి రూ.160 కోట్ల రెమ్యునరేషన్ అందుకుని సూపర్ స్టార్ ని వెనక్కి తోసేసాడు.
ఇక ఇప్పుడు ఇదంతా బానే ఉంది కానీ.. సూపర్ స్టార్ రజినీకాంత్ ని ఎన్టీఆర్ భయపెట్టడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇది ఫేక్ న్యూస్ అసలు కాదు. ఇదే నిజానికి ఎంతో దగ్గర ఉన్న విషయమని అంటున్నారు. ఎందుకంటే దసరా స్పెషల్ గా రావాల్సిన సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ వెట్టయాన్ వాయిదా పడనుందట. దసరాకు ఇంకా వారానికి కాస్త అటు ఇటు గానే టైం పడుతుందని ఇంతవరకు తెలుగు ప్రమోషన్ల, అలాగే తమల ప్రమోషన్లు కూడా చేయలేదు. ఇక అందుకు కారణం ఒకటే దేవర సునామి... కోలీవుడ్లో దేవర క్రేజ్ తెలుగు, హిందీ స్థాయిలో లేదు. ఇలా దేవర పెద్ద మార్కెట్లైన బాలీవుడ్ - టాలీవుడ్ లో రీ సౌండ్ చేస్తుంటే మరో మూవీకి వసూలు వరద కష్టం. అందుకే రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా తన మూవీ వెట్టయాన్ వెనుకు తీసుకు వెళుతున్నాడు. దసరా నుంచి దీపావళికివెట్టయాన్ వాయిదా పడేలా కనిపిస్తుంది.
దేవర సునామీ ఈరేంజ్ లో ఉన్నప్పుడు పోటీ కంటే, ఈ సినిమా జోరు తగ్గాక సీన్ లకొస్తే, వసూళ్ల వరద, ఓపెనింగ్స్ బాగుండే ఛాన్స్ ఉంది. అందుకే పెద్ద హీరో, యంగ్ హీరో లాంటి లెక్కలు వేసుకోకుండా, రజినీకాంత్ వాయిదా తీర్మాణానికే మొగ్గుచూపాడట. అంటే దేవర దెబ్బకి సూపర్ స్టార్ మూవీ వెట్టయాన్ కూడా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అసలు దేవర ఆడటం కష్టం, ఫ్లాప్ మూవీ అన్న వాళ్లందరికీ ఇలాంటి సంఘటనలు కళ్లు తెరిపించేలా ఉన్నాయి. నిజంగా ఇది ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించే న్యూసే… తమిళ జనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, దేవర దరువుకి, పెద్ద హీరోల సినిమాలు వెనకడుగు వేయక తప్పట్లేదు..