మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ మోడల్ గా కెరీర్ ను మొదలు పెట్టి అలా రాణిస్తున్న గానే సినిమాల్లోకి వచ్చి భారీ క్రేజ్ ను అందుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అలా  హీరోయిన్ గా రాణిస్తున్న క్రమంలో నే ఐశ్వర్య జీవితం లో ఎన్నో అనుకోని మలుపులు వచ్చాయి .. సల్మాన్ ఖాన్ నుంచి హృతిక్ రోషన్ వరకు అందరి తోను ప్రేమలో పడింద నే వార్తలు కూడా వచ్చాయి . అదే క్రమంలో బాలీవుడ్  బిగ్ బి అమితాబచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ తో ఏడడుగులు నడిచి ఫ్యామిలీ లైఫ్ లో అడుగు పెట్టింది.
 

వీరికి ఆరాధ్య బచ్చన్ అనే కూతురు కూడా ఉంది . ఇదే క్రమంలో గ‌త‌ కొన్ని రోజులుగా ఐశ్వర్యరాయ్ కాపురంలో కలహాలు ఉన్నాయ నే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఐశ్వర్య - అభిషేక్ బచ్చన్ తో కలిసి ఉండటం లేదని .. ఇద్దరు విడి విడిగా ఉంటున్నారని విడాకులు తీసుకోబోతున్నార నే పుకార్లు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజా గా ఆమె రాసుకున్న పర్సనల్ డైరీలో  పేజీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అందులో తన భర్తతో ఎలా ఉండాలని విషయాలను ఐశ్వర్య రాసుకుంది.  'చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకెళ్లే పార్ట్‌నర్‌ కావాలి', 'నిజాయతీ, మర్యాద వంటి సద్గుణాలు కలిగిన వ్యక్తి కావాలి' అని డైరీలో ఐశ్వర్య రాసింది.

 

ఇక తన కలల రాకుమారుడికి కావాల్సిన లక్షణాలు అభిషేక్‌ బచ్చన్‌లో లేనట్టు ఉన్నాయి.  అందుకే విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. 'మై లవ్‌. ఆల్వేస్‌ ఐశ్వర్య రాయ్‌' అని సంతకం చేసిన ఆ పేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా ఐశ్వర్య ఆ డైరీ ఏ రోజు, ఏ సంవత్సరం రాశారనేది తెలియడం లేదు. ఈ డైరీ పేజీ లీకవడంతో ఐశ్వర్యకు కావాల్సిన లక్షణాలు అభిషేక్‌లో లేవని.. త్వరలో విడాకులు తీసుకుంటారని చర్చ జరుగుతోంది. మరి ఏ జరుగుతుందనేది కాలమే నిర్ణయించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: