మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్‌కు దేవర మరో మెట్టు ఎక్కించింది. ఇప్పటికే రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా ఆదిరిపోయే రికార్డులు సృష్టిస్తుంది. ఇదే క్రమంలో ఎన్టీఆర్ తర్వాత సినిమాలపై కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. అలా ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో వార్‌2 కూడా ఒకటి.  బాలీవుడ్ లో తొలిసారిగా ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కూడా ఇదే.బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ వార్ 2 లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.



గతంలో వచ్చిన వార్ 1న్ సూపర్ హిట్ అవటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. అంచనాలకు ఏం మాత్రం త‌గ్గ‌కుండా దర్శకుడు అయాన్ ముఖర్జీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ హృతిక్ కాంబోలో మాస్ సాంగ్ ను తెరకెక్కిచ్చేందుకు ఏర్పాటులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే సెట్ వరకు కూడా పూర్తయిందని బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ పాట చిత్రీకరణ కోసం అక్టోబర్ మూడో వారంలో ఎన్టీఆర్ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వైభవి మర్చంట్‌ నేతృత్వంలో పాట చిత్రీకరణ జరగబోతుంది. టాలీవుడ్‌ లో బెస్ట్‌ డాన్సర్స్ లో ఎన్టీఆర్‌ ఒకరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


 

ఇక బాలీవుడ్‌ లో బెస్ట్‌ డాన్సర్ హృతిక్ రోషన్ అనే విషయం తెల్సిందే. అలాంటి వీరిద్దరి కాంబోలో పాట అంటే కచ్చితంగా మరో లెవల్‌ లో ఉంటుంది అంటూ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వార్‌ 2 సినిమా షూటింగ్‌ ఇటీవల యూరప్ లో జరిగింది. ఆ షెడ్యూల్‌ లో ఎన్టీఆర్‌ హాజరు అవ్వలేదు. హృతిక్‌ రోషన్ మాత్రమే హాజరు అయ్యారు. ఈ నెలలో జరగబోతున్న షూటింగ్‌ లో ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్‌ లు కలిసి హాజరు అవ్వబోతున్నారు. మళ్లీ నవంబర్‌ లో లేదా డిసెంబర్‌ లో భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ పూర్తియ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ కోసం బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్, హృతిక్లను ఒకేసారి స్క్రీన్ పై ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఇక మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: