టాలీవుడ్ నెం. 1 హీరో ఎవరంటే అది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న.. గతంలో సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ వంటి స్టార్స్ ఇండస్ట్రీ లో ఓ వెలుగు వెలిగారు.. ఆ తరువాత తరం నుంచి చిరంజీవి ఫుల్ ఫామ్ లో కి రావడంతో టాలీవుడ్ మెగాస్టార్ గా దూసుకుపోయారు.. ఎంతమంది స్టార్స్ వచ్చిన చిరంజీవి సాధించిన రికార్డ్స్ సాధించలేకపోయారు.. అయితే నేటి తరం హీరోలలో నెం. 1 హీరో ఎవరు అంటే చెప్పటం కష్టమే.. ఇండస్ట్రీ లో ప్రతి  స్టార్ హీరో అభిమానులకు తమ అభిమాన హీరోల సినిమాలకు సంబంధించిన రికార్డ్స్ చాలా ప్రత్యేకం.వేరే హీరోతో పోల్చేందుకు వాటిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటారు.అయితే ఒక్కోసారి నిర్మాతలు సైతం అభిమానుల నుంచి తీవ్ర ఒత్తిడి ని భరించలేక వాళ్ళ కోసం వచ్చిన కలెక్షన్స్ కంటే ఎక్కువ చూపించడం వంటివి చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఓ సినిమా సూపర్ హిట్ అని చెప్పాలంటే.. మాక్సిమమ్ థియేటర్సలో శత దినోత్సవం జరిగితే ఆ సినిమా సూపర్ హిట్ అని ఇండస్ట్రీ వర్గాలు తెలియజేస్తారు..

అయితే ఈమధ్య కాలంలో ఒక సినిమా సక్సెస్ అయిందని చెప్పాలంటే ఆ సినిమాకు అయిన బిజినెస్ ఎంత ఆ సినిమా సాధించినా కలెక్షన్స్ అన్ని చూసుకొని బ్రేక్ ఈవెన్ అయితే ఆ సినిమా సక్సెస్ అయినట్లు చెబుతున్నారు.. అలాగే భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాకు 200 కోట్ల గ్రాస్ పోస్టర్లు, 500 కోట్ల గ్రాస్ పోస్టర్లు ఇప్పుడు వస్తున్న ప్రతి స్టార్ హీరో సినిమాకు చాలా సాధారణంగానే కనిపిస్తున్నాయి. అయితే ఎన్ని పోస్టర్లు వేసుకున్నా, అభిమానుల కోసం ఎన్ని రికార్డ్స్ ని బహిర్గతం చేసినా ఆ హీరో తదుపరి చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ని బట్టి ఆ హీరో స్థాయి ఏమిటి అనేది మార్కెట్ లో ట్రేడ్ వర్గాలకి అర్థం అయిపోతుంది. అలా ట్రేడ్ ని దశాబ్దాలుగా దగ్గర నుండి పరిశీలిస్తున్న వారిలో దగ్గుబాటి సురేష్ బాబు ఒకరు .

నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో గొప్ప సినిమాలను అందించిన ఆయన, రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోలలో ఎవరు ఓపెనింగ్స్ లో కింగ్ అనే విషయాన్ని తెలిపారు.. ఆయన మాట్లాడుతూ ‘మన తెలుగు లో పవన్ కళ్యాణ్ గారికి అందరికంటే భారీ ఓపెనింగ్స్ సాధించే స్టామినా ఉంది. ఆ తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్ వంటి వారికి ఓపెనింగ్స్ భారీగా వస్తాయి.కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ని మించిన స్టార్ హీరో అయితే లేరు. ఆయన చిన్న డైరెక్టర్ తో సినిమా తీసినా కూడా  భారి ఓపెనింగ్స్ వస్తాయి.అదే పవన్ స్టార్ డైరెక్టర్ తో కనుక సినిమా చేస్తే ఆ కలెక్షన్స్ జోరు మనం ఊహించడానికి కూడా కష్టం, అలాంటి వసూళ్లు లభిస్తాయి.. కాబట్టి ఆయనే నా దృష్టిలో నెంబర్ 1 హీరో’ అంటూ సురేష్ బాబు చెప్పుకొచ్చాడు.చిత్ర పరిశ్రమ సంక్షోభంలో వున్న సమయంలో కూడా పవన్ సినిమాకు ఊహించని కలెక్షన్స్ వచ్చాయి అది పవన్ స్టామినా అంటూ సురేష్ బాబు తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: