ఈ సినిమా విడుదలై ఏళ్ళు గడిచిన ఇంకా సినీ ప్రేక్షకులకు ఈ మూవీ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. అయితే ఈ సినిమాలోని చాలా పార్ట్ కూడా ఒక పెద్దింట్లో కొనసాగుతుంది. అందులో అల్లు అర్జున్ రియల్ తల్లి అయిన టబు ఉంటుంది. అయితే వారి ఇంటి పైనే వైకుంఠపురం అనే పేరు రాసి ఉంటుంది. ఇక ఈ ఇల్లు చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ ఒక్కసారిగా గేట్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వెళుతున్నప్పుడు.. ఇది భూలోక స్వర్గంలా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది చూస్తున్న ప్రేక్షకులకు.
అయితే సాధారణంగా సినిమాల కోసం ఎక్కువగా ఇలాంటి ఇల్లుని సెటప్ వేయడం చేస్తూ ఉంటాము. కానీ ఇది రియల్ ఇల్లేనట. అయితే ఈ ఇల్లు ఎవరిదో చాలా మందికి తెలియదు. అలా వైకుంఠపురంలో చూపించిన పెద్ద ఇల్లు ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్ టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కుమార్తె రచన చౌదరి భర్తదట. ఇక ఆ ఇంటి విలువ దాదాపు 300 కోట్ల వరకు ఉంటుందట. అది కూడా రెండేళ్ల క్రితం. ఇక ఇప్పుడు ఆ ఇంటిదగ్గర ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాదులో ఉన్న ఖరీదైన ఇళ్లల్లో ఇది కూడా ఒకటట.