ఇలా ఒక్కసారిగా ఎందుకు సినిమాలకు దూరమయ్యాడు అన్న విషయం ఫ్యాన్స్ కి కూడా అర్థం కాలేదు. ఇక ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ధ్రువ సినిమాలో విలన్ పాత్రలో నటించి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు అరవిందస్వామి. ఇక ఈ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నాడు. ఇటీవల కార్తి హీరోగా నటించిన సత్యం సుందరం సినిమాలోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
అయితే ఇటీవల హీరో అరవింద్ స్వామి గురించి ఒక సంచలన నిజం బయటపడింది. హీరోగా సినిమాలు చేస్తున్న సమయంలో సడన్గా ఇండస్ట్రీ కి దూరమై లాంగ్ గ్యాప్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు అరవిందస్వామి. రోజా, బొంబాయి సినిమాలతో సూపర్ హిట్ అందుకుని అమ్మాయిల కలల రాకుమారుడుగా కొనసాగిన అరవింద స్వామి.. 2000 నుంచి 2013 వరకు చేసింది రెండు సినిమాలే.. అయితే వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలో తీవ్రమైన నొప్పితో పాటు కాలికి పక్షవాతం కూడా వచ్చిందట. దానివల్ల సినిమాలకు దూరంగా ఉన్నానని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అరవింద స్వామికి పక్షవాతం అని తెలియగానే ఫ్యాన్స్ షాక్ లో మునిగిపోయారు అయితే ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు అంత సెట్ అయింది అంటూ చెప్పుకొచ్చాడు ఆయన.